వీడియో... బికినీలో జలకాలాడుతున్న రకుల్... వైరల్ గా ఇంస్టాగ్రామ్ పోస్ట్!

Published : Oct 13, 2021, 03:33 PM IST
వీడియో... బికినీలో జలకాలాడుతున్న రకుల్... వైరల్ గా ఇంస్టాగ్రామ్ పోస్ట్!

సారాంశం

లేటెస్ట్ గా రకుల్ పంచుకున్న ఓ వీడియో వైరల్ గా మారింది. బికినీ ధరించిన రకుల్ స్విమ్మింగ్ పూల్ వద్ద ఆహ్లాదంగా గడుపుతున్న వీడియో షేర్ చేశారు.

మూడు పూలు ఆరుకాయలు అన్నట్లుంది రకుల్ పరిస్థితి. చేతినిండా సినిమాలతో కెరీర్ రేసు గుర్రంలా పెరుగుతుండగా... ఆ ఆనందాన్ని పంచుకోవడానికి తోడు కూడా దొరికింది. ఇటీవల 31వ బర్త్ డే జరుపుకున్న Rakul preeth singh తన ప్రేమికుడిని పరిచయం చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ లో నటుడు, నిర్మాతగా కొనసాగుతున్న జక్కి భగ్నానీ తో తన ప్రేమను ధృవీకరించింది ఆమె. ప్రేమలో పడ్డారని తెలుసుకున్న ఫ్యాన్స్, సన్నిహితులు రకుల్ కి బెస్ట్ విషెస్ తెలియజేశారు. 


కాగా లేటెస్ట్ గా రకుల్ పంచుకున్న ఓ వీడియో వైరల్ గా మారింది. బికినీ ధరించిన రకుల్ స్విమ్మింగ్ పూల్ వద్ద ఆహ్లాదంగా గడుపుతున్న వీడియో షేర్ చేశారు. హాలిడే రోజు బికినీలో జలకాలాడుతూ ఎంజాయ్ చేసిన ఓ వీడియోను ఆమె పంచుకోవడం జరిగింది. రకుల్ ని బికినిలో చూసిన ఫ్యాన్స్ కేజ్రీ గా ఫీల్ అవుతున్నారు. సదరు వీడియోపై కామెంట్స్ చేస్తూ, లైక్స్ తో విరుచుకుపడ్డారు... దీనితో రకుల్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ క్షణాల్లో వైరల్ గా మారింది. 

Also readరాధికా ఆప్టే బోల్డ్ షో.. బిగుతైన ఎద అందాలతో మామూలు రచ్చ కాదుగా!
ఇక రకుల్ నటించిన కొండ పొలం అక్టోబర్ 8న విడుదలైంది. క్రిష్ దర్శకత్వంలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఆ చిత్రం అనుకున్నంత ఆదరణ దక్కించుకోలేదు. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన Konda polam వసూళ్లు కూడా ఆశాజనకంగా లేవు. తెలుగులో రకుల్ గత చిత్రం చెక్ సైతం అట్టర్ ప్లాప్ గా నిలిచింది. 

Also read ఆయన అక్కడ ఈమె ఇక్కడ... సోషల్ మీడియాలో మాత్రం పరువాల జాతర... చిన్న గౌనులో మరలా రెచ్చిపోయిన ప్రియమణి
అయితే బాలీవుడ్ లో రకుల్ వరుస ఆఫర్స్ దక్కించుకోవడం విశేషం. అటాక్, థాంక్ గాడ్, మే డే వంటి భారీ చిత్రాలతో కలిపి, ఐదు హిందీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. అలాగే ఓ తెలుగు తమిళ్ బైలింగ్వల్ చిత్రం చేస్తున్నారు. మొత్తంగా 8 ప్రాజెక్ట్స్ వరకు ఆమె చేతిలో ఉన్నాయి. మరోవైపు డ్రగ్స్ ఆరోపణలు రకుల్ కి తలనొప్పిగా మారాయి.గత ఏడాది ముంబై ఎన్సీబీ అధికారులు విచారణ ఎదుర్కొన్న రకుల్, తాజాగా టాలీవుడ్ ప్రముఖులతో పాటు ఈడీ ఎదుట హాజరయ్యారు. వరుసగా ఇలాంటి ఆరోపణలు రకుల్ ని వేదనకు గురిచేస్తున్నాయి.     
 

PREV
click me!

Recommended Stories

Raghavendra Rao: ఈ వయసులో ఇవేం పనులు, దర్శకేంద్రుడిపై మండిపడుతున్న నెటిజన్లు
Nagabandham Trailer Review: అనంత పద్మనాభస్వామి ఆలయ రహస్యాలు, నాగబంధం ట్రైలర్ రివ్యూ..