Hyper Aadi : సుడిగాలి సుధీర్ రికార్డ్ ను బ్రేక్ చేసిన ‘హైపర్ ఆది’.. దూసుకుపోతున్న ‘పుష్ప’ స్కిట్..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 04, 2022, 04:08 PM IST
Hyper Aadi : సుడిగాలి సుధీర్ రికార్డ్ ను బ్రేక్ చేసిన ‘హైపర్ ఆది’.. దూసుకుపోతున్న ‘పుష్ప’ స్కిట్..

సారాంశం

ఈటీవీలో ప్రసారమయ్యే కామెడీ షో ‘జబర్దస్త్’ అంటే టీవీ ఆడియెన్స్ కు ఎంతో ఇష్టం. ప్రత్యేకంగా సుడిగాలి సుధీర్, హైపర్ ఆది స్కిట్ లకు  వచ్చే రెస్పాన్స్ వేరే లెవల్ లో ఉంటుంది. అయితే మొన్నటి వరకు సుడగాలి సుధీర్ క్రియేట్ చేసిన అన్ని రికార్డులను హైపర్ ఆది తాజాగా బ్రేక్ చేశాడు.   

తొమ్మిదేండ్లుగా ఈటీవీ లో మల్లెమాల వారి జబర్దస్త్ కామెడీ షో ప్రసారం అవుతూ నెంబర్ వన్ కామెడీ షో గా నిలుస్తోంది.  ఇప్పటి వరకు జబర్దస్త్ ద్వారా ఎంతో మంది కమెడియన్స్ గుర్తింపు దక్కించుకున్నారు. కొందరు కమెడియన్స్ జబర్దస్త్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుండగా ఎక్కువ శాతం మంది వేర్వేరు కారణాలతో ఇతర చానల్స్ కు వెళ్లడం.. కొందరు సినిమా లో సెటిల్ అయ్యారు.  

జబర్దస్త్ లో సుడిగాలి సుదీర్ ఎంట్రీ ఇచ్చి సుదీర్ఘ కాలమే అయ్యింది. ఆయన జర్నీ జబర్దస్త్ ప్రారంభం అయిన కొన్నాళ్లకి  ప్రారంభమైంది. ఆయన కామిడీ స్కిట్లు అంటే కచ్చితంగా ప్రేక్షకులు చూడాల్సిందే అన్నట్లుగా ఉంటారు. సుడిగాలి సుధీర్ టీంలో గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ ఉండటం, వీరి కాంబినేషనల్ లో వచ్చిన ఏ స్కిట్ అయినా ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటున్నారు. వీరి స్కిట్లను టీవీలో మిస్ అయినా యూట్యూబ్లో మాత్రం తప్పకుండా చూస్తుంటారు. 

దీంతో య్యూటూబ్ లోకి వచ్చిన సుడిగాలి సుధీర్ స్కిట్లను ఆడియెన్స్ తప్పకుండా చూస్తుంటారు. మిగిలిన కాంటెస్ట్ ల కంటే సుధీర్ టీం వేసే పంచులు, కాంబినేషన్ ఎంటర్ టైన్ మెంట్ గా ఉండటంతో అందరి కంటే ఎక్కువ వ్యూస్ ఈ టీంకే దక్కేవి. ఒకటి రెండు రోజుల్లోనే మిలియన్ల వ్యూస్ సుధీర్  టీం సొంత చేసుకుంది. కానీ ఇప్పుడు ఆ రికార్డును ‘హైపర్ ఆది’ బ్రేక్ చేశాడు. 

హైపర్ ఆది మరియు సుడిగాలి సుదీర్ ల మద్య పోటీ అన్నట్లుగా పుష్ప సినిమాను కామెడీ గా చేశారు.  అయితే ఈ కామెడీ స్కిట్లు యూట్యూబ్ లో నువ్వా నేనా అన్నట్లు గా పోటీ పడుతున్నాయి. రెండు కామెడీ స్కిట్ లు కూడా యూట్యూబ్ లో కోటికి పైగా వ్యూస్‌ ను దక్కించుకున్నాయి. కానీ హైపర్ 14 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుని 30 లక్షల అదనపు వ్యూస్ తో సుధీర్ ను వెనక్కి నెట్టాడు. దీంతో సుధీర్ ఇన్నాళ్లు య్యూటూబ్ లో క్రియేట్ చేసిన రికార్డును ‘ఆది’ బద్దలు కొట్టాడు.  

PREV
click me!

Recommended Stories

Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?
Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి