
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్ర మానియా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. వరల్డ్ వైడ్ గా ఉన్న సెలెబ్రిటీలు, స్టార్ క్రికెటర్లు సైతం చిత్రంలోని పాటలకు డాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన పుష్ప మొదటి భాగం మంచి విజయం సాధించింది. సెకండ్ పార్ట్ కి కావలసిన పబ్లిసిటీ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది అనే చెప్పాలి. దీనితో పార్ట్ 2పై ఊహించని విధంగా అంచనాలు పెరిగిపోయాయి. అల్లు అర్జున్ ఈ చిత్రంలో ఎర్రచందనం స్మగ్లర్ గా అద్భుతంగా నటించాడు.
బాలీవుడ్ ప్రముఖులు సైతం అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల కాలంలో సినిమాకి భాషా బేధాలు తొలిగిపోతున్నాయి. తెలుగు సినిమాలు బాలీవుడ్ లో రాణిస్తున్నాయి. బాలీవుడ్ నటులు తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో అలియా భట్ సీత పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
ఆర్ఆర్ఆర్ విడుదల కాకముందే అలియా భట్ కి తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. కొరటాల శివ, ఎన్టీఆర్ చిత్రంలో అలియా భట్ హీరోయిన్ గా ఎంపికైంది. ఈ విషయాన్ని ఇటీవల ఇంటర్వ్యూలో అలియా కంఫర్మ్ చేసింది. మరో విషయం గురించి కూడా అలియా ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
పుష్ప చిత్రం తర్వాత అంతా అల్లు అర్జున్ జపం చేస్తున్నారు. అలియా భట్ ఫ్యామిలీ మొత్తం అల్లు అర్జున్ ఫాన్స్ గా మారిపోయారట. ఈ విషయాన్ని అలియా తెలిపింది. అల్లు అర్జున్ తో ఖచ్చితంగా నటించాలని అలియా ఫ్యామిలీ ఆమెపై ఒత్తిడి చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. బన్నీ సినిమాలో ఛాన్స్ వస్తే వదులుకోవద్దని చెబుతున్నారట. తాను కూడా బన్నీ ఫ్యాన్ అయిపోయినట్లు అలియా పేర్కొంది.
అలియా.. అల్లు అర్జున్ పక్కన స్టెప్పులేసే తరుణం కోసం అభిమానులు ఎదురు చూడడమే ఇక.