ప్రత్యర్థులతో డబుల్‌ గేమ్‌ ఆడుతున్న సుధీర్‌బాబు.. అదిరిపోయేలా `హంట్‌` టీజర్‌

Published : Oct 03, 2022, 12:48 PM IST
ప్రత్యర్థులతో డబుల్‌ గేమ్‌ ఆడుతున్న సుధీర్‌బాబు.. అదిరిపోయేలా `హంట్‌` టీజర్‌

సారాంశం

`హంట్` సినిమాలో సుధీర్‌బాబు స్టయిలీష్‌ పోలీస్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. సిక్స్ ప్యాక్‌ బాడీతో ఆయన కనిపించబోతున్నారు. ఆద్యంతం హై వోల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా టీజర్‌ విడుదలై అందరిని ఆకట్టుకుంటుంది. 

సుధీర్‌బాబు ఈ సారి డబుల్‌ గేమ్‌ ఆడబోతున్నారు. తలోని ఏ, బీలను పరిచయం చేయబోతున్నారు. పోలీస్‌ లుకలో అదరగొట్టబోతున్నారు. ఇటీవలే `వీ`లో పోలీస్‌గా చేసిన ఆయన ఇప్పుడు మరోసారి పోలీస్‌గా తన విశ్వరూపం చూపించబోతున్నారు. అదే సమయంలో రెండు షేడ్స్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించబోతున్నారు. అది కూడా అర్జున్‌ అనే పోలీస్‌ పాత్రలో. ఆయన హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ `హంట్‌`. ఈ చిత్ర టీజర్‌ నేడు(సోమవారం) విడుదలైంది. 

ఇందులో సుధీర్‌బాబు స్టయిలీష్‌ పోలీస్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. సిక్స్ ప్యాక్‌ బాడీతో ఆయన కనిపించబోతున్నారు. ఆద్యంతం హై వోల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా టీజర్‌ విడుదలై అందరిని ఆకట్టుకుంటుంది. ఇందులో.. `అర్జున్‌లో ఇద్దరున్నారు. ఒకరు `ఏ`,  మరొకరు `బి` అనుకుంటే అర్జున్‌ `ఏ`కి తెలిసిన మనుషులు,  సంఘటనలు,  పర్సనల్‌ లైఫ్‌ ఏదీ అర్జున్‌ `బీ`కి తెలియదు. వేర్వేరు మనుషులు అన్నట్టు. అయితే `అర్జున్ 'ఎ'కి తెలిసిన భాషలు, స్కిల్స్, పోలీస్ ట్రైనింగ్ అర్జున్ 'బి'లో ఉన్నాయి. అర్జున్ 'ఎ'గా ఉండటమే అర్జున్‌కు ఇష్టం! అతని కోరిక నెరవేరిందా? అర్జున్ మొదలుపెట్టి సాల్వ్ చేయలేకపోయినా కేసు ఏమిటి? అనేది 'హంట్' సినిమాలో చూడాల్సిందే. 

`హంట్` టీజర్ యాక్షన్ ప్యాక్డ్‌గా కట్ చేశారు. సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సుధీర్ బాబు నటనకు తోడు సిక్స్ ప్యాక్ కూడా ఆట్టుకునేలా ఉంది. 'తను ఎలా చనిపోయాడో తెలుసుకునే ప్రాసెస్‌లో ఎవరు ఎఫెక్ట్ అయినా... ఎంత ఎఫెక్ట్ అయినా... నన్ను ఎవరూ ఆపలేరు' అని టీజర్ చివరలో సుధీర్ బాబు చెప్పే డైలాగ్ మరింత క్యూరియాసిటీ పెంచింది. సుధీర్‌బాబు హీరోగా శ్రీకాంత్‌,  భరత్‌ కీలక పాత్రలు పోషించిన `హంట్‌` చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నారు. మహేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు.  

ఇందులో మైమ్ గోపి, కబీర్ దుహన్ సింగ్, మౌనిక రెడ్డి, గోపరాజు రమణ, మంజుల, చిత్రా శుక్ల, సుపూర్ణ మల్కర్, సంజయ్ స్వరూప్, రవి వర్మ, 'జెమినీ' సురేష్, అభిజీత్ పూండ్ల, కోటేష్ మన్నవ, సత్య కృష్ణన్ తదితరులు ఇతర తారాగణం.

'హంట్' సినిమా సాంకేతిక వర్గం :
ఆర్ట్ డైరెక్టర్ : వివేక్ అన్నామలై, కాస్ట్యూమ్ డిజైనర్ : రాగ రెడ్డి, యాక్షన్ : రేనౌడ్ ఫవేరో (యూరోప్), స్టంట్స్ : వింగ్ చున్ అంజి, ఎడిటర్ : ప్రవీణ్ పూడి, సినిమాటోగ్రఫీ : అరుల్ విన్సెంట్‌, సంగీతం : జిబ్రాన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అన్నే రవి, నిర్మాత : వి. ఆనంద ప్రసాద్, దర్శకత్వం : మహేష్. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Pawan Kalyan తో నటించి కనిపించకుండా పోయిన హీరోయిన్లు, లిస్ట్ లో ఐదుగురు.. ఆమె మాత్రం చేజేతులా..
10 భాషల్లో 90 సినిమాలు.. 50 ఏళ్ల పెళ్లి కాని బ్యాచిలర్ హీరోయిన్ ఎవరో తెలుసా ?