‘పుష్ప 2’లో మరో బాలీవుడ్ స్టార్.. ఫహద్ ఫాజిల్ పాత్రకు ప్రమాదమేమీ లేదుగా?

By team teluguFirst Published Oct 3, 2022, 12:18 PM IST
Highlights

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న ‘పుష్స 2’ గురించి క్రేజీ అప్డేట్స్ అందుతున్నాయి. ఇప్పటికే పూజా కార్యక్రమం గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. అయితే బాలీవుడ్ స్టార్ హీరో ఈ మూవీలో నటించబోతున్నట్టు తెలుస్తోంది.
 

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన మాస్ యాక్షన్ ఫిల్మ్ ‘పుష్ప : ది రైజ్’. ఈ చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. మూవీలోని డైలాగ్స్, అల్లు అర్జున్ మేనరిజం, సాంగ్స్ ఇప్పటికీ ఏదోరకంగా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. పాపులర్ క్రికెటర్స్, పొలిటిషన్స్ కూడా చిత్రంలోని ‘పుష్పరాజ్’ మేనరిజాన్ని  ఫాలోవ్వడంతో ప్రపంచ వ్యాప్తంగా మూవీకి మంచి క్రేజ్ ఏర్పడింది. మొదటి భాగానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో ‘పుష్ప  2’ను మరింత గ్రాండ్ గా తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నారు.

‘పుష్ప ది రూల్’ (Pushpa The Rule)ను మరింత గ్రాండ్ గా చిత్రీకరించబోతున్నారు. ఇప్పటికే బడ్జెట్ ప్లాన్ ను కూడా రూ.350 కోట్లతో పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఈక్రమంలో పార్టు 2లోనూ మరిన్ని పాత్రలను పరిచయం చేయబోతున్నారంట దర్శకుడు సుకుమార్. ఇప్పటికే స్టార్ హీరోయిన్ సమంత, ప్రియమణి పేర్లు కీలక పాత్రల కోసం వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మరో బాలీవుడ్ స్టార్ హీరోను కూడా సినిమాలో నటించాలని చిత్ర యూనిట్ సంప్రదించినట్టు సమాచారం. 

మలయాళ యాక్టర్ ఫహద్ ఫాజిల్ (Fahad Fazil)నే మెయిన్ విలన్ గా చూపిస్తూ ‘ఫుష్ప : ది రైజ్’ను పూర్తి చేశారు సుకుమార్. దీంతో పార్టు 2లో ఫహద్ ఫాజిల్, పుష్పరాజ్ కు మధ్య వార్ జరగనున్నట్టు  హింట్ ఇచ్చారు. అయితే తాజాగా అందించిన సమాచారం ప్రకారం.. బాలీవుడ్ స్టార్ నటుడు అర్జున్ కపూర్ (Arjun Kapoor)ను కూడా పుష్ప 2లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఫహిద్ ఫాజిల్ తో కలిసి పనిచేస్తారా? లేదా పై ఆఫీసర్ గా కనిపిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు అర్జున్ కపూర్. మరోవైపు నిర్మాతగానూ తన మార్క్ చూపిస్తున్నారు. 

పుష్ప2లోనూ అల్లు అర్జున్ - రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై మరింత గ్రాండ్ గా నిర్మించబోతున్నారు. సిండికేట్ డాన్ గా పుష్ప రాజ్ ఇంకా పవర్ ఫుల్ గా కనిపించనున్నారు. పార్ట్ 2లోనూ అదిరిపోయే ఐటెం సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారు. సునీల్, అనసూయ, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 

click me!