ప్రభాస్ ఆదిపురుష్ లుక్ పై బండ్ల కామెంట్... ఏకిపారేస్తున్న నెటిజెన్స్!

By Sambi ReddyFirst Published Oct 3, 2022, 11:57 AM IST
Highlights

నిన్న ఆదిపురుష్ టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. దీనికి మిక్స్డ్ రెస్పాన్స్ దక్కింది. కాగా రామునిగా ప్రభాస్ లుక్ పై నటుడు బండ్ల గణేష్ స్పందించారు. ఈ క్రమంలో బండ్ల గణేష్ పై కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. 
 

ఎలివేషన్స్ ఇవ్వడంలో బండ్ల గణేష్ తర్వాతే ఎవరైనా. చెయ్యి తిరిగిన రైటర్స్ కూడా ఆయన ముందు దిగదుడుపే. పవన్ కళ్యాణ్ గురించి చెప్పమంటే ఆయనకు పూనకం వచ్చేస్తుంది. డిక్షనరీలో ఉన్న పెద్ద పెద్ద పదాలు తీసుకొచ్చి కుమ్మరిస్తారు. పవన్ తో పాటు అప్పుడప్పుడు ఇతర హీరోలకు, పొలిటీషియన్స్ కి కూడా బండ్ల గణేష్ ఓ రేంజ్ ఎలివేషన్స్ ఇస్తూ ఉంటారు. తాజాగా ప్రభాస్ ఆదిపురుష్ లుక్ పై ఇలాంటి ఎలివేషన్ ఆయన ఇచ్చారు. 

ఆదిపురుష్ పోస్టర్ పోస్ట్ చేసిన బండ్ల గణేష్...  కళ్ళల్లో రాజసం మీసం లో పౌరుషం అచ్చం శ్రీ రామచంద్ర మహాప్రభు లాగా ఉన్న ప్రభాస్, అంటూ కామెంట్ చేశారు. బండ్ల గణేష్ కామెంట్ ప్రభాస్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. వారంతా కామెంట్స్ రూపంలో బండ్ల గణేష్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అదే సమయంలో యాంటీ ఫ్యాన్స్ ఏకిపారేస్తున్నారు. ఆదిపురుష్ ఫస్ట్ లుక్, టీజర్ ఏమి బాగోలేదని కామెంట్స్ పెడుతున్నారు. 

కళ్ళల్లో రాజసం మీసం లో పౌరుషం అచ్చం శ్రీ రామచంద్ర మహాప్రభు లాగా ఉన్న ⁦⁩ 🔥🔥🔥🔥 pic.twitter.com/k3ptO3KGIJ

— BANDLA GANESH. (@ganeshbandla)

ఆదిపురుష్ టీజర్ నిరాశపరిచిందనేది మాత్రం వస్తాం. ఏడో కార్టూన్ మూవీని తలపించిన నేపథ్యంలో పూర్తి నిరాశకు గురయ్యారు. కొందరైతే అప్పట్లో రజినీకాంత్ చేసిన కొచ్చిడయాన్ చిత్రాన్ని తలపించింది అంటున్నారు. సీజీ వర్క్ చాలా నాశిరకంగా ఉంది. దర్శకుడు ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కించలేదని అర్థమవుతుంది. టెలివిజన్ సిరీస్ ప్రమాణాలతో ఆదిపురుష్ తెరక్కించారనిపిస్తుంది. టీజర్ నిరాశ పరిచిన నేపథ్యంలో ఆదిపురుష్ మూవీపై అంచనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
 
దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ చిత్రాన్ని రామాయణ గాథగా తెరకెక్కించారు. ప్రభాస్ కి జంటగా సీత పాత్ర కృతి సనన్ చేశారు. ఇక రామాయణ విలన్ రావణాసురుడు పాత్రను సైఫ్ అలీ ఖాన్ చేశారు. 2023 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఆదిపురుష్ వరల్డ్ వైడ్ విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఆదిపురుష్ విడుదల చేయనున్నారు. 

click me!