SaiRam Shankar : సాయిరామ్ శంకర్ ‘ఒక పథకం ప్రకారం’ ఫస్ట్ లుక్‌కు అనూహ్య స్పందన..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 26, 2022, 06:24 PM IST
SaiRam Shankar : సాయిరామ్ శంకర్ ‘ఒక పథకం ప్రకారం’ ఫస్ట్ లుక్‌కు అనూహ్య స్పందన..

సారాంశం

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా విడుదలైన సాయిరామ్ శంకర్ ‘ఒక పథకం ప్రకారం’ ఫస్ట్ లుక్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది.  పోస్టర్ ను చూసిన ప్రేక్షకులు పోస్టర్ ఆసక్తిగా ఉన్నట్టు తెలుపుతున్నారు.    

సాయిరామ్ శంకర్, అశీమా నర్వాల్ జంటగా వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ఒక పథకం ప్రకారం. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు విన్నింగ్ దర్శకుడు వినోద్ విజయన్ తెరకెక్కిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా వస్తుంది. ఇందులో రామ రావణ తరహా పాత్రలో నటిస్తున్నారు సాయిరామ్ శంకర్. 

తాజాగా ఈ చిత్ర పోస్టర్ రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా విడుదలైంది. దీనికి అద్భుతమైన స్పందన వస్తుంది. సినిమా కాన్సెప్టును పోస్టర్‌లోనే చూపించారు మేకర్స్. ఇందులో కొత్తగా కనిపిస్తున్నారు సాయిరామ్ శంకర్. పూర్తిగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గానే ఒక పథకం ప్రకారం వస్తుంది. ఈ చిత్రం కోసం ఆరుగురు నేషనల్ అవార్డ్ విన్నర్స్ వర్క్ చేస్తున్నారు. 

దర్శకుడు వినోద్ విజయన్, ఎడిటిర్, మేకప్ ఆర్టిస్ట్, ప్రొడక్షన్ డిజైనర్ సహా మరో ఇద్దరు జాతీయ అవార్డు గ్రహీతలు ఒక పథకం ప్రకారం సినిమా కోసం పని చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరికొన్ని విశేషాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.

 సినిమాలో ప్రధాన పాత్రదారుడిగా సాయిరామ్ శంకర్, అశీమా నర్వాల్ హీరోయిన్ గా పలు పాత్రలను శృతి సోధి, సముద్రఖని, కళాభవన్ మణి, రవి పచ్చముత్తు, భాను శ్రీ, పల్లవి గౌడ పోషించనున్నారు. నిర్మాతలుగా వినోద్ విజయన్, రవి పచ్చముత్తు, గార్లపాటి రమేష్ వ్యవహరించారు.  వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఎడిటింగ్: కార్తిక్ జోగేష్, సినిమాటోగ్రఫీ: రాజీవ్ రవి, వినోదిల్లంపల్లి, సురేష్ రాజన్, సంగీతం: గోపీ సుందర్ అందించనున్నారు. ఫస్ట్ లుక్ తోనే ప్రేక్షకుల మన్ననలు పొందడం పట్ల చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నది.  

PREV
click me!

Recommended Stories

Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?
Kalyan Padala Winner: కామన్ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం