షాకింగ్.. హాట్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్ గా రాంచరణ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

pratap reddy   | Asianet News
Published : Sep 17, 2021, 02:41 PM IST
షాకింగ్.. హాట్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్ గా రాంచరణ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

సారాంశం

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఓటిటి దిగ్గజం డిస్ని ప్లస్ హాట్ స్టార్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. ఇటీవలే రాంచరణ్ హాట్ స్టార్ తో డీల్ కుదుర్చుకున్నాడు.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఓటిటి దిగ్గజం డిస్ని ప్లస్ హాట్ స్టార్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. ఇటీవలే రాంచరణ్ హాట్ స్టార్ తో డీల్ కుదుర్చుకున్నాడు. డీల్ ప్రకారం కొన్నేళ్ల పాటు రాంచరణ్ డిస్ని ప్లస్ హాట్ స్టార్ సంస్థకి ప్రచార కర్తగా వ్యవహరించనున్నారు. 

హాట్ స్టార్ సంస్థ రాంచరణ్ కి రెమ్యునరేషన్ గా భారీ అమౌంట్ అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఏడాదికి 5-7 కోట్ల వరకు రాంచరణ్ హాట్ స్టార్ నుంచి పారితోషికం అందుకోనున్నారట. రెమ్యునరేషన్ ప్రకారం ఇది కళ్ళు చెదిరే డీల్ అని చెప్పొచ్చు. 

ఈ డీల్ రాంచరణ్ బ్రాండ్ వాల్యూని తెలియజేసేలా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. హాట్ స్టార్ సంస్థ ఒక స్టార్ హీరోతో కొలాబరేట్ కావడం కూడా ఇదే తొలిసారి. 

రాంచరణ్ సినిమాలతో బిజీగా గడుపుతూనే ఇలాంటి ఫైనాన్సియల్ డీల్స్ తో హాట్ టాపిక్ గా మారాడు. రాంచరణ్ తెలుగులో ఓ టీవీ ఛానల్ ని కొనబోతున్నట్లు కూడా ఇటీవల వార్తలు మొదలయ్యాయి. 

ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవలే రాంచరణ్- శంకర్ కాంబోలో చిత్రం ప్రారంభమైంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో నటించిన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీగా ఉంది. అలాగే ఆచార్య చిత్రంలో రాంచరణ్ కామియో రోల్ పోషిస్తున్నాడు. 

PREV
click me!

Recommended Stories

Avatar 3 Review: అవతార్‌ 3 మూవీ రివ్యూ, రేటింగ్‌.. జేమ్స్ కామెరూన్‌ ఇక ఇది ఆపేయడం బెటర్‌
Chiranjeevi, Mahesh Babu సినిమాలతో పోటీ పడి టాప్ 5లో నిలిచిన హీరో, టాలీవుడ్ రాజకీయాలపై ఓపెన్ కామెంట్స్