గొడవలు పెట్టడమే పనిగా పెట్టుకున్న బిగ్ బాస్... టాస్క్ ల పేరుతో సభ్యుల మధ్య చిచ్చు!

Published : Sep 17, 2021, 01:04 PM ISTUpdated : Sep 17, 2021, 01:06 PM IST
గొడవలు పెట్టడమే పనిగా పెట్టుకున్న బిగ్ బాస్... టాస్క్ ల పేరుతో సభ్యుల మధ్య చిచ్చు!

సారాంశం

తాజా ఎపిసోడ్ లో బిగ్ బాస్ మరలా ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెట్టాడు.  కంటెస్టెంట్స్ అందరూ ఏకాభిప్రాయానికి వచ్చి ఒక వరస్ట్ ఫెరఫార్మన్ ని ఎంచుకోవాలని సూచించారు. ఉన్న 18మందిలో ఒకరిని వరస్ట్ అంటూ ఎన్నుకోవడం అంటే చాలా కష్టమైన వ్యవహారం. 

కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెట్టడమే పనిగా పెట్టుకున్నాడు బిగ్ బాస్. ఈ సీజన్లో హౌస్ లో టాస్క్ లన్నీ సభ్యుల మధ్య మనస్పర్థలు, మాటల యుద్దాలు రేకెత్తించేవిగా ఉన్నాయి. కెప్టెన్సీ టాస్క్ బిగ్ బాస్ కోసం ఇంటి సభ్యులను ఇరు జట్లుగా విభజించి, ఫిజికల్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ గెలవడం కోసం బలాబాలాల ప్రదర్శనకు దిగారు కంటెస్టెంట్స్. రెండు వారాలు కూడా ముగియకుండానే ఈ రేంజ్ టాస్క్ లు ఏందీ బాబోయ్ అంటూ.. ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

తాజా ఎపిసోడ్ లో బిగ్ బాస్ మరలా ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెట్టాడు.  కంటెస్టెంట్స్ అందరూ ఏకాభిప్రాయానికి వచ్చి ఒక వరస్ట్ ఫెరఫార్మన్ ని ఎంచుకోవాలని సూచించారు. ఉన్న 18మందిలో ఒకరిని వరస్ట్ అంటూ ఎన్నుకోవడం అంటే చాలా కష్టమైన వ్యవహారం. అదే సమయంలో ఇది ఇంటి సభ్యుల మధ్య వివాదాలు రేకెత్తే అంశం. 

నేటి ఎపిసోడ్ లేటెస్ట్ ప్రోమో చూస్తే ఇది అర్థం అవుతుంది. ఈ టాస్క్ ఇంటి సభ్యుల మధ్య వివాదాలకు కారణం అయ్యింది. అదే సమయంలో ఆర్జే కాజల్, నటి ప్రియ మధ్య వాగ్వాదం జరిగింది. అబద్ధాలు కూడా చాలా విడమరిచి గట్టిగా చెబుతావ్ అంటూ కాజల్ ని ప్రియ విమర్శించారు. ఇక ప్రియ సంస్కారాన్ని కాజల్ ప్రశ్నించింది. 

నేటి ఎపిసోడ్ సైతం వాడివేడిగా సాగే అవకాశం కలదు. ఇక యూట్యూబర్ సరయు గత వారం హౌస్ నుండి ఎలిమినేట్ కావడం జరిగింది. మొత్తం 18మంది సభ్యులు ఉన్న బిగ్ బాస్ హౌస్ నుండి ఈ ఆదివారం ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఈ సారి ఎలిమినేషన్స్ నామినేషన్స్ లిస్ట్ లో ఏడుగురు సభ్యులు ఉన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ameesha Patel: నాలో సగం ఏజ్‌ కుర్రాళ్లు డేటింగ్‌కి రమ్ముంటున్నారు, 50ఏళ్లు అయినా ఫర్వాలేదు పెళ్లికి రెడీ
Bigg Boss telugu 9 లో మిడ్ వీక్ ఎలిమినేషన్, ఆ ఇద్దరిలో బయటకు వెళ్లేది ఎవరు?