విజయ్ క్రేజ్ కి 'రంగస్థలం' నిర్మాతలు షాక్!

Published : Aug 20, 2018, 06:37 PM ISTUpdated : Sep 09, 2018, 11:00 AM IST
విజయ్ క్రేజ్ కి 'రంగస్థలం' నిర్మాతలు షాక్!

సారాంశం

వరుస విజయాలతో ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ స్టామినాని మరింత పెంచింది 'గీత గోవిందం' సినిమా తొలివారంలో రూ.40 కోట్ల షేర్ ని రాబట్టి సత్తా చాటింది

వరుస విజయాలతో ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ స్టామినాని మరింత పెంచింది 'గీత గోవిందం' సినిమా తొలివారంలో రూ.40 కోట్ల షేర్ ని రాబట్టి సత్తా చాటింది. ఇప్పుడు విజయ్ సినిమాలకు క్రేజ్ మాములుగా లేదు. ప్రస్తుతం విజయ్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పుడు గీత గోవిందం ఎఫెక్ట్ ఈ సినిమాపై పడింది.

ఈ సినిమా హక్కుల కోసం బయ్యర్లు పోటీ పడుతున్నారు. ఓవర్సీస్ లో అయితే ఐదు కోట్లు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల హక్కులు కలిపి ఇరవై నుండి ఇరవై ఐదు కోట్లు ఆఫర్ చేస్తున్నారట డిస్ట్రిబ్యూటర్లు. అయితే ఈ సినిమాను నిర్మాతలు పది కోట్లలో పూర్తి చేయాలనుకుంటున్నారు. హీరో రెమ్యునరేషన్ సెపరేట్. ఇంకా షూటింగ్ కూడా పూర్తి కానీ సినిమాకు ఇప్పటినుండే భారీ క్రేజ్ ఏర్పడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

పైగా ఈ సినిమా కథ కొత్తగా ఉంటుందనే టాక్ కూడా ఉంది. దీంతో ముందుగానే అడ్వాన్సులు ఇచ్చి హక్కులు దక్కించుకోవడానికి రెడీ అవుతున్నారు. విజయ్ కి ఉన్న క్రేజ్ ని చూసి మైత్రిమూవీ మేకర్స్ వారు షాక్ అవుతున్నారట. అయితే ఇప్పుడే సినిమాను అమ్మడం ఇష్టంలేక కొద్దిరోజులు ఆగాలని నిర్ణయించుకున్నారట. 

ఇవి కూడా చదవండి..

నెక్స్ట్ బిగ్ బాస్ హోస్ట్ విజయ్ దేవరకొండ..?

'గీత గోవిందం' తొలివారం కలెక్షన్లు..

PREV
click me!

Recommended Stories

Shanmukh: దీప్తి సునైనాతో బ్రేకప్.. కొత్త అమ్మాయిని పరిచయం చేసిన షణ్ముఖ్,త్వరలో పెళ్లి
బాలకృష్ణ వద్దనుకున్న హీరోయిన్ తో రొమాన్స్ చేయాలనుకున్న తారక్.. ఆ కోరిక ఈ జన్మకి తీరదు, మరీ అంత పిచ్చా ?