తలైవాతో త్రిష రొమాన్స్!

Published : Aug 20, 2018, 05:29 PM ISTUpdated : Sep 09, 2018, 11:54 AM IST
తలైవాతో త్రిష రొమాన్స్!

సారాంశం

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం దర్శకుడు కార్తిక్ సుబ్బరాజుతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే విషయంపై పలు ఆలోచనలు చేసిన చిత్రబృందం ఫైనల్ గా త్రిష దగ్గర ఆగింది

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం దర్శకుడు కార్తిక్ సుబ్బరాజుతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే విషయంపై పలు ఆలోచనలు చేసిన చిత్రబృందం ఫైనల్ గా త్రిష దగ్గర ఆగింది. రజినీకాంత్ సరసన హీరోయిన్ గా త్రిషని ఫైనల్ చేశారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. అయితే రజినికాంత్ తో కలిసి నటించడం పట్ల త్రిష బాగా ఎగ్జైట్ అవుతోంది.

తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంటూ.. 'కొన్ని సార్లు నిద్ర లేచిన తరువాత కూడా ఇంకా కలలోనే ఉన్నామనిపిస్తుంది' అంటూ ట్వీట్ చేసింది. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా దాదాపు అగ్రహీరోలందరితో  జోడీ కట్టిన త్రిష ప్రస్తుతం తమిళ చిత్రాలతో బిజీగా మారింది.

ఇప్పటివరకు ఆమె రజినీకాంత్ తో కలిసి నటించింది లేదు. తొలిసారి తలైవా సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాలో తమిళ హీరో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించనున్నాడు. 

 

PREV
click me!

Recommended Stories

Brahmamudi Serial Today Episode: సొంత ఇంటికే కన్నం వేసిన ఐశ్వర్య, దొంగలను చితక్కొట్టిన ఇందు, నందు
Karthika Deepam 2 Today Episode:దీప భయం-మెంటల్ షాక్‍లో సుమిత్ర-దశరథ కంగారు-జ్యోకు కార్తీక్ వార్నింగ్