బాలీవుడ్ హ్యాండ్సమ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) ను కలిసారు హీరోయిన్ సమంత. అయితే హృతిక్ ను కలిసింది మాత్రం మన టాలీవుడ్ హీరోయిన్ సమంత కాదు. హాలీవుడ్ హీరోయిన్ సమంత లాక్ వుడ్.
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) ను ముంబయ్ లోని ఆయన ఇంట్లో కలిసింది హాలీవుడ్ స్టార్ సమంత లాక్ వుడ్(Samantha Lockwood). షూట్ ద హీరో లాంటి సూపర్ హిట్ మూవీస్ చేసిన ఈ హీరోయిన్ లాస్ ఏంజిల్ నుంచి ఇండియా వచ్చారు ముంబయ్ లో సందడి చేశారు. కలర్ ఫుల్ డ్రెస్ లో.. అట్రాక్టీవ్ గా ఉన్న సమంత... హృతిక్ రోషన్(Hrithik Roshan) తో చాలా సేపు చిట్ చాట్ చేశారు. అంతే కాదు ఇండియన్ స్టార్ హీరోను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది అంటోంది హాలీవుడ్ హీరోయిన్.
హృతిక్ రోషన్ ను కలిసి.. ఆయన తో స్పెండ్ చేసి న మోమరీస్ ను ఇన్ స్టాలో శేర్ చేసుకున్నారు సమంత లాక్ వుడ్(Samantha Lockwood). యాక్షన్ ను బాగా ఇష్టపడే యాక్షన్ హీరోను హృతిక్ రోషన్ అంటూ ఆ పోస్ట్ కు క్యాప్షన్ కూడా ఇచ్చింది సమంత. ప్రస్తుం వీరిద్దరు కలిసి చిట్ చాట్ చేసుకున్న పిక్స సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విరిద్దరు కలిశారంటే ఫ్యూచర్ లో హాలీవుడ్ మూవీలో హృతిక్ రోషన్ కాని.. బాలీవుడ్ సినిమాలో సమంత లాక్ వుడ్ కాని నటించే అవకాశం ఉందంటూ.. నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Also Real : Prabhas Project-k Update: ప్రభాస్, దీపికాను ప్రాజెక్ట్ కె లో.. నాగ్ అశ్వీన్ ఎలా చూపించబోతున్నాడో తెలుసా..?
హృతిక్ రోషన్ (Hrithik Roshan) ప్రస్తుతం తన సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన విక్రమ్ వేదను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో స్క్రీన్ ను శేర్ చేసుకోబోతున్నారు మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్. ఈమూవీ ఫస్ట్ షెడ్యూల్ రీసెంట్ గా కంప్లీట్ చేసుకున్నారు హృతిక్ . ఈ సినిమాతో పాటు దీపికా పదుకోన్ తో కలిసి ఫైటర్ సినిమా చేస్తున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో.