Prabhas Project-k Update: ప్రభాస్, దీపికాను ప్రాజెక్ట్ కె లో.. నాగ్ అశ్వీన్ ఎలా చూపించబోతున్నాడో తెలుసా..?

By Mahesh Jujjuri  |  First Published Dec 24, 2021, 11:32 AM IST

ప్రాజక్ట్ కె గురించి ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్, రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ కి వెళ్లిన ఆయన పాన్ ఇండియా సినిమాల క్రెడిట్ ను ప్రభాస్- రాజమౌళికి ఇచ్చేశాడు. ఇప్పుడు అందరూ పాన్ ఇండియా సినిమాలు చేయాలి అంటున్నారు అంటే దానికి కారణం వీరిద్దరే అన్నాడు.


ప్రాజక్ట్ కె గురించి ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ కి వెళ్లిన ఆయన.. పాన్ ఇండియా సినిమాల క్రెడిట్ ను ప్రభాస్- రాజమౌళికి ఇచ్చేశాడు. ఇప్పుడు అందరూ పాన్ ఇండియా సినిమాలు చేయాలి అంటున్నారు అంటే దానికి కారణం వీరిద్దరే అన్నాడు.

ప్రభాస్ రాధేశ్యామ్(Radhe Shyam) ప్రీ రిలీజ్ ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు స్టార్ సెలబ్రెటీస్ అంతా హాజరయ్యారు. వీరితో పాటు ప్రాభాస్ తో సినిమా చేస్తున్న సందీప్ వంగ, ఓంరౌత్, తో పాటు ప్రభాస్ తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin) కూడా ఈవెంట్ లో జాయిన్అయ్యారు. ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో నాగ్ అశ్వీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రభాస్(Prabhas) తో తను చేస్తున్న సినిమా గురించి కూడా ఓ రెండు విషయాలు మాట్లాడారు నాగ్.

Latest Videos

 

 ‘‘ఇప్పుడంతా పాన్‌ ఇండియా సినిమాలు అంటున్నారంటే దానికి కారణం ప్రభాస్‌, దర్శకుడు రాజమౌళినే(Rajamouli) అన్నారు నాగ్ అశ్విన్. వారు చూపిన దారిలోనే మేం పయనిస్తున్నాం. మాతో పాటు ఇంకా చాలా మంది డైరెక్టర్లు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు అంటూ... ప్రభాస్- రాజమౌళికి క్రెడిట్ అంతా ఇచ్చేశారు అశ్విన్. ఇక రాధేశ్యామ్‌ సినిమా గురించి మాట్లాడుతూ..ఈమూవీ  ట్రైలర్‌ అద్భుతంగా ఉంది. ప్రభాస్‌(Prabha)- పూజా(Pooja) కెమిస్ట్రీ బాగుంది.రాధేశ్యామ్ టీమ్క మొత్తానికి ఆల్ ది బెస్ట అన్నారు యంగ్ డైరెక్టర్.

 

ఇక  ప్రభాస్ తో తాను చేస్తోన్న  ‘ప్రాజెక్ట్‌ కె’  సినిమా గురించి మాట్లాడారు అశ్విన్.  ఈసినిమా విషయానికొస్తే..  ఈమూవీలో ప్రభాస్‌ హిందీ పెర్ఫామెన్స్‌ తో పాటు  దీపికా పదుకొన్(Deepika Padukone) తెలుగు పెర్ఫామెన్స్‌తో సినిమాను తెరకెక్కిస్తునాన్నన్నారు.ఇద్దరిని కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నా అన్నారు.  ఇక ఈ సినిమా గురించి మరన్ని విషయాలను  తర్వాత  మాట్లాడుకుందాం  అని అన్నారు నాగ్ అశ్వీన్.

Also Read : Trivikram Movie Update: ప్రొడ్యూసర్ అవతారం ఎత్తిన త్రివిక్రమ్.. లిస్ట్ లో ఉన్న స్టార్ హీరోలెవరంటే...?

దాదాపు 300 కోట్లకు పైగా బడ్జెట్ తో.. ప్రభాస్ తో, పాన్ వరల్డ్ స్థాయిలో మూవీ చేస్తున్నారు నాగ్ అశ్విన్. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై, అశ్వినీ దత్త్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రభాస్ పక్కన బాలీవుడ్ స్టార్ దీపికా పదుకోన్ నటిస్తుంది. బిగ్ బీ అమితాబ్ (Amitabh Bachchan ) ఇంపార్టెంట్ రోల్ లో కనిపించబోతున్నారు. వీరితో పాటు ఇంకా స్టార్ యాక్టర్స్ చాలా మంది ప్రాజెక్ట్ కే లో జాయిన్ అవుతారని తెలుస్తోంది.  

click me!