దివ్యభారతి చనిపోయిన రాత్రి ఏం జరిగిందంటే..?

Published : Feb 26, 2019, 09:29 AM IST
దివ్యభారతి చనిపోయిన రాత్రి ఏం జరిగిందంటే..?

సారాంశం

నటి దివ్యభారతిని ఎవరూ కావాలని చంపలేదని, అలా అని ఆమె ఆత్మహత్య కూడా చేసుకోలేదని ఆమె తండ్రి ఓం భారతి వెల్లడించాడు. నిన్న దివ్యభారతి 45వ జయంతి సందర్భంగా మరోసారి ఈ అంశం చర్చకు దారితీసింది. 

నటి దివ్యభారతిని ఎవరూ కావాలని చంపలేదని, అలా అని ఆమె ఆత్మహత్య కూడా చేసుకోలేదని ఆమె తండ్రి ఓం భారతి వెల్లడించాడు. నిన్న దివ్యభారతి 45వ జయంతి సందర్భంగా మరోసారి ఈ అంశం చర్చకు దారితీసింది. ఆమె మరణంపై కలిగిన అనుమానాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి.

చిన్న వయసులోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె 1993,ఏప్రిల్ 5న ముంబైలో తన అపార్ట్మెంట్ ఐదో అంతస్తు నుండి కింద పడిపోయి మరణించింది. అయితే ఆమెను ఎవరైనా హత్య చేసి ఉంటారని కొందరు, తాగి కావాలనే సూసైడ్ చేసుకుందని మరికొందరు రకరకాలుగా వార్తలు వినిపించేవి.

అయితే మరణానికి కొద్ది గంటల ముందు ఏం జరిగిందనే విషయాలను ఆమె తండ్రి ఓం భారతి వెల్లడించాడు. ఆ రోజు దివ్యభారతి మద్యం సేవించింది కానీ ఎక్కువగా తాగలేదని చెప్పిన ఓం భారతి ప్రమాదవశాత్తు దివ్యభారతి చనిపోయిందని చెప్పారు. పిట్టగోడపై కూర్చున్న దివ్యభారతి కంట్రోల్ తప్పి కింద పడిపోయిందని అన్నారు.

ఆమె ఉండే అపార్ట్మెంట్ బిల్డింగ్ లో అన్ని ఫ్లాట్ లకు గ్రిల్స్ ఉన్నాయని దివ్యభారతి ఫ్లాట్ కి మాత్రం ఉండేది కాదని గుర్తు చేశారు. అపార్ట్ మెంట్ కింద ఎప్పుడూ కార్లు పార్క్ చేసి ఉండేవని కానీ దివ్యభారతి మరణించిన రోజు ఒక్క కారు కూడా పార్క్ చేయకపోవడంతో దివ్య నేరుగా కింద పడిపోయిందని ఓం భారతి వెల్లడించారు.

వైద్యబృందం వచ్చేసరికి కొనప్రాణంతో దివ్యభారతి ఉందని, ఆమెని హాస్పిటల్ కి తీసుకువెళ్లేసరికి ప్రాణాలు కోల్పోయిందని ఓం భారతి వెల్లడించారు.  

PREV
click me!

Recommended Stories

శ్రీవిష్ణు మృత్యుంజయ్ మూవీ ఫస్ట్ రివ్యూ..సీట్ ఎడ్జ్ మీద కూర్చునేలా సీన్లు, క్రైమ్ థ్రిల్లర్ తో సూపర్ హిట్ ?
Super Star Krishna: మహేష్ బాబు చేయాల్సిన మూవీ నాగార్జున చేతికి.. కృష్ణ అడ్డుపడకపోతే పెద్ద ఘోరమే జరిగేది