ఆ ఒక్క సీన్ చూసి ఏడ్చేశా: ఎన్టీఆర్

Published : Feb 25, 2019, 08:41 PM ISTUpdated : Feb 25, 2019, 08:42 PM IST
ఆ ఒక్క సీన్ చూసి ఏడ్చేశా: ఎన్టీఆర్

సారాంశం

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కెవి గుహన్ తెరకెక్కించిన చిత్రం '118'. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. 

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కెవి గుహన్ తెరకెక్కించిన చిత్రం '118'. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ''కెమెరామెన్ గా ఉన్నప్పటి నుండి నాకు గుహన్ గారు తెలుసు. ఇద్దరం కలిసి బాద్ షా సినిమా చేశాం. ఆ సినిమాలో బంతిపూల జానకి పాటను ఎంతో అందంగా చిత్రీకరించారు. కష్టపడి పని చేసే మనిషి. 118 చిత్రాన్ని మరింత శ్రద్ధతో తీశారు. ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఈ సినిమా నేను చూశాను. ఒక సీన్ లో నివేదా థామస్ పెర్ఫార్మన్స్ కి నాకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చేశాయి. షాలిని పాండే కూడా తన పాత్రలో బాగా నటించింది. కొత్తగా కథ చెప్పాలని అన్నయ్యకి చాలా క్యూరియాసిటీ.ఈ సినిమా ఆయన కెరీర్ లో బెస్ట్ ఫిలిం అవుతుంది. ఈసినిమా సక్సెస్ అయి అన్నయ్యకి మరింత స్ఫూర్తినివ్వాలని ఆశిస్తున్నాను. మార్చి 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది'' అన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Avatar 3 Review: అవతార్‌ 3 మూవీ రివ్యూ, రేటింగ్‌.. జేమ్స్ కామెరూన్‌ ఇక ఇది ఆపేయడం బెటర్‌
Chiranjeevi, Mahesh Babu సినిమాలతో పోటీ పడి టాప్ 5లో నిలిచిన హీరో, టాలీవుడ్ రాజకీయాలపై ఓపెన్ కామెంట్స్