అయ్యో బాలయ్య.. మళ్ళీ టంగ్ స్లిప్!

By Prashanth MFirst Published Feb 25, 2019, 8:52 PM IST
Highlights

కళ్యాణ్ రామ్ - నివేత థామస్ నటించిన 118 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్ర యూనిట్ గ్రాండ్ గా నిర్వహించింది. అయితే వేడుకలో బాలకృష్ణ - జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఎంట్రీ బాగానే ఉంది గాని స్పీచ్ లో మరోసారి బాలకృష్ణ పొరపాటున సినిమా టైటిల్ నే మార్చేశారు. ఆయన స్పీచ్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో ఊహించని విధంగా ట్రోలింగ్ నడుస్తోంది. 

118 సినిమాను కాస్త బాలకృష్ణ 189 గా మార్చేశారు. సాధారణంగా ఒకసారి పొరపాటున అన్నారంటే ఎవరు అంతగా పట్టించుకోరు. కానీ బాలకృష్ణ ఎండింగ్ వరకు అసలు టైటిల్ ను గ్రహించలేకపోయారు. ఒక వైపు కళ్యాణ్ రామ్ చెవి దగ్గర హింట్ ఇచ్చినప్పటికీ దాన్ని పట్టించుకోలేదు. మళ్ళీ తరువాత స్పీచ్ ఎండింగ్ లో కూడా 189 అంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. 

దీంతో అది కాస్తా సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అవుతోంది. ఈవెంట్ లో ఎక్కువ సేపు ఎవరు మాట్లాడలేదు. బాలకృష్ణ కూడా చిత్ర యూనిట్ ని అన్నదమ్ములిద్దరిని రెండు మాటలతో పొగిడేసి సినిమా మంచి విజయం సాధించాలని విషెస్ అందించారు. 

click me!