
బిగ్ బాస్ సీజన్ 7కి సర్వం సిద్ధం అవుతుంది. ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోలు చక్కర్లు కొడుతున్నాయి. ఫస్ట్ ప్రోమోలో నాగార్జున కుడి ఎడమైతే... అని అన్నారు. ఈ కుడి ఎడమ అర్థం ఏమిటీ? బిగ్ బాస్ తెలుగు 7 ఎలా డిజైన్ చేశారు? అనే సందేహాలు అందరిలో మొదలయ్యాయి. లేటెస్ట్ ప్రోమోలో ఈ ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చారు. ఆగస్టులో బిగ్ బాస్ 7 మొదలు కానుంది. ఈ లోపు బీబీ షైనింగ్ స్టార్స్ పేరుతో ఓ షో నిర్వహిస్తున్నారు.
గత ఆరు సీజన్స్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ బీబీ షైనింగ్ స్టార్స్ షోలో పాల్గొననున్నారు. సుమ యాంకర్ గా ఉండగా, నాగార్జున సైతం జాయిన్ అవుతున్నారు. బీబీ షైనింగ్ స్టార్స్ ప్రోమో విడుదల కాగా... నాగార్జున నెక్స్ట్ సీజన్ గురించి మాట్లాడారు. యాంకర్ సుమ 'కుడి ఎడమైతే' అన్నారు. దాని అర్థం ఏమిటని నాగార్జునను అడిగారు.
అందుకు సమాధానంగా నాగార్జున... షోలో కొత్త రూల్స్, కొత్త గేమ్స్, కొత్త ఛాలెంజెస్ ఉంటాయని వెల్లడించారు. సీజన్ 6 అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. దారుణమైన టీఆర్పీ రాబట్టింది. ఈ క్రమంలో మేకర్స్ సీజన్ 7 ని సరికొత్తగా సిద్ధం చేశారని తెలుస్తుంది. సీజన్ 7 కి హోస్ట్ మారతాడంటూ గట్టిగా ప్రచారం జరిగింది. అయితే అవన్నీ అపోహలేనని తేలిపోయింది... కింగ్ నాగార్జునను మరలా రంగంలోకి దించారు. నాగార్జునతో కూడిన బిగ్ బాస్ 7 ప్రోమో వచ్చేసింది. ఎన్ని విమర్శలు వచ్చినా నాగార్జున కొనసాగించడానికి బలమైన కారణం కూడా ఉంది.
తెలుగులో 2017లో బిగ్ బాస్ షో స్టార్ట్ చేశారు. ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రసారమైన ఫస్ట్ సీజన్ గ్రాండ్ సక్సెస్. టాప్ సెలెబ్రిటీలు కంటెస్టెంట్స్ గా పాల్గొనడంతో పాటు ఎన్టీఆర్ హోస్టింగ్ స్కిల్స్ కిక్ ఇచ్చాయి. సీజన్ 2 నుండి ఎన్టీఆర్ తప్పుకున్నాడు. నాని రంగంలోకి దిగారు. ఆయనకు జస్ట్ పాస్ మార్క్స్ పడ్డాయి. రేటింగ్ పరంగా ఓకే. ఇక సీజన్ 3 నుండి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.