
శ్రీవిష్ణు(Sree Vishnu) హీరోగా వచ్చిన లేటెస్ట్ సినిమా సామజవరగమన(Samajavaragamana) ఎంత పెద్ద సెన్సేషన్ అయ్యిందో తెలిసిందే. రామ్ అబ్బరాజు(Ram abbaraju) దర్శకత్వంలో చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుని దూసుకువెళ్లిపోతోంది. శ్రీవిష్ణు, నరేశ్ తండ్రీకుమారులుగా నటించి ప్రేక్షకులందరిని కడుపుబ్బా నవ్వించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. కేవలం రూ.7 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయిటకు వచ్చింది.
అదేంటంటే.. సామజవరగమన సినిమా కథను దర్శకుడు రామ్ అబ్బరాజు ముందు యంగ్ హీరో సందీప్ కిషన్(Sandeep kishan) కు చెప్పారని తెలుస్తోంది. ఈ దర్శకుడు మొదట సినిమా వివాహ భోజనంబు కు సందీప్ కిషన్ నిర్మాత. దాంతో ఆ చనువుతో ఈ హీరోకే చెప్పారు. అయితే అప్పటికే సందీప్ యాక్షన్ ఎంటర్టైనర్ .. మైఖేల్ టైటిల్ తో వచ్చిన తమిళ్, తెలుగు సినిమా చేస్తుండటంతో.. ఈ సినిమా చేయలేనని చెప్పేసారట. అయితే సందీప్ కిషన్ ఎన్నో ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్న మైఖేల్ సినిమా భారీ డిజాస్టర్ గా అయ్యింది. ఇటు సామజవరగమన పెద్ద హిట్ అయ్యింది. ఈ విషయం తెసులుకున్న సందీప్ కిషన్ ఫ్యాన్స్ బాధ కలగటం సహజమే కదా.సందీప్ కిషన్ కు పడాల్సిన హిట్ శ్రీవిష్ణుకు వెళ్లిపోయిందే అంటున్నారు.
మరో ప్రక్క సామజవరగమన ఓటీటీ రిలీజ్‌కు ముహూర్తం ఖరారైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన ఆహాలో జులై 28న ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకున్న ఆహా ఈమేరకు అధికారికంగానే ప్రకటించింది. ఈ చిత్రానిక రామ్ అబ్బరాజు దర్శకుడు. రెబా మోనికా జాన్ హీరోయిన్. శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటించారు.