కొన్ని సినిమాలు కొందరకి స్టార్డమ్ తెచ్చి పెడతాయి. అలా బేబి సినిమాలో చేసిన ఇద్దరు హీరోల సంగతి ఎలా ఉన్నా..అన్ని చోట్లా అందరూ హీరోయిన్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) గురించే మాట్లాడుతున్నారు. ఆమె క్యారక్టర్ ఎంతలా కనెక్ట్ అయ్యిపోయిందంటే హోర్డింగ్ పై ఆమె ఫొటోని చెప్పుతో కొట్టేటంతలా యూత్ బుర్రల్లోకి ఎక్కేసింది. ఇంతలా యూత్ లోకి వెళ్లిపోయిన అమ్మాయికి ఆఫర్స్ కొదవుంటాయా...వరస ఫోన్స్ మోగుతూనే ఉన్నాయట. అయితే ఆమె ఆచి తూచి అడుగులు వేస్తోంది.
తాజాగా మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు వైష్ణవి తన నెక్ట్స్ ప్రాజెక్టు ప్రముఖ సంస్థ అయినటువంటి గీతా ఆర్ట్స్‌లో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆల్రెడీ టాక్స్ జరిగాయని అంటున్నారు. అది కూడా ఫీమేల్ ఓరియేంటేడ్ అని బేబీ సక్సెస్ మీట్‌లోనే అల్లు అరవింద్ ఇండైరక్ట్ గా చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే వైష్ణవి క్రేజ్ ని మరో పెద్ద ప్రాజెక్టులో తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అల్లు శిరీష్ కమిటైన కొత్త చిత్రంలో వైష్ణవి కాంబోతో కలిపి ఓ మూవీని ప్లాన్ చేస్తున్నారని టాక్. బేబి హీరోయిన్ అంటే క్రేజ్ ఉంటుంది కాబట్టి...అల్లు శిరీష్ సినిమాకు అది ప్లస్ అవుతుందని భావిస్తున్నారట. అయితే ఇంత పెద్ద సక్సెస్ సాధించినా ఆమెకు స్టార్ హీరోల సినిమాల్లో మాత్రం ఆఫర్స్ రావటం లేదనేది అభిమానులు బాధ. ఇక్కడ కేవలం నటన కావాలి అంటారు కానీ గ్లామర్ హీరోయిన్స్ కే ఓటు అనేది నిజం అని సోషల్ మీడియాలో బేబి హీరోయిన్ ఆఫర్స్ పై కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇక అల్లు అర్జున్ కూడా బేబీలో వైష్ణవి నటనకు ఫిదా అయ్యానని ఓపెన్‌గా స్టేజిపై చెప్పారు. ఆయన సినిమాలో కీలకమైన రోల్స్ ఉంటే ఖచ్చితంగా తీసుకుంటారు అని భావిస్తున్నారు. హీరోయిన్ గా అల్లు అర్జున్ సరసన కష్టం కానీ..సినిమాలో కీ రోల్స్ కు అడుగుతారని అంటున్నారు. ఏదైమైనా గీతా ఆర్ట్స్ ఈ హీరోయిన్ కెరీర్ ని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లాలి మరి.