ప్రభాస్‌తో భేటీ కానున్న హోంమంత్రి అమిత్‌ షా .. కృష్ణంరాజు కుటుంబానికి పరామర్శ

By Aithagoni RajuFirst Published Sep 14, 2022, 4:47 PM IST
Highlights

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా .. ప్రభాస్‌తో భేటీ కానున్నారు. కృష్ణంరాజు ఇటీవల కన్నుమూసిన నేపథ్యంలో తన సంతాపాన్ని తెలియజేయబోతున్నారు. అందుకు టైమ్‌ ఫిక్స్ అయ్యింది.

ప్రభాస్‌, వారి కుటుంబం తీరని బాధలో ఉంది. రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు అకాల మరణం వారిని దుఖ సాగరంలో ముంచెత్తింది. తమ కుటుంబాలకు పెద్ద దిక్కుగా కృష్ణంరాజు మరణంతో ప్రభాస్‌ ఒంటరైన ఫీలింగ్‌లోకి వెళ్లిపోయారు. ప్రభాస్‌, కృష్ణంరాజు ఫ్యామిలీ మెంబర్స్ అంతులేని బాధలో ఉన్నారు. వారిని సినీ, రాజకీయ ప్రముఖులు ఓదార్చుతున్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తన సంతాపాన్ని తెలియజేయబోతున్నారు. అందులో భాగంగా రేపు(గురువారం) ఆయన ప్రభాస్‌తో భేటీ కానున్నారు. ఈ మేరకు అధికారిక షెడ్యూల్‌ ఫిక్స్ అయ్యింది.

సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన వేడుకల్లో పాల్గొనేందుకు రేపు హైదరాబాద్‌ కి వస్తోన్న అమిత్‌ షా మొదటగా ప్రభాస్‌ ని కలవబోతున్నారట. కృష్ణం రాజు ఫ్యామిలీని పరామర్శించి, ఆయన మృతి పట్ల తన సానుభూతిని తెలియజేయనున్నారని తెలుస్తుంది. కృష్ణంరాజు చివరి వరకు బీజేపీ పార్టీలో ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఆయన బీజేపీ నుంచి కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. తెలుగు సినీ పరిశ్రమలో పెద్దగానూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అమిత్‌ షా ప్రభాస్‌ ఫ్యామిలీని కలిసి తన సంతాపాన్ని తెలియజేయబోతుండటం విశేషం. 

ఇదిలా ఉంటే అమిత్‌ షా ఇటీవల వరుసగా సినిమా సెలబ్రిటీలను కలుస్తున్నారు. మొదట ఆయన ఎన్టీఆర్‌ని కలిసి రాజకీయాలపై చర్చించినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత బీజేపీ జాతీయ నాయకులు నడ్డా యంగ్‌ హీరో నితిన్‌ని మీట్‌ అయ్యారు. ఇప్పుడు అమిత్‌ షా ప్రభాస్‌ ని కలవబోతుండటం రాజకీయంగా మరింత ఆసక్తిగా మారింది. దీంతోపాటు నిఖిల్‌ని కూడా అమిత్‌ షా కలబోతున్నట్టు తెలుస్తుంది. 

ప్రభాస్‌ `బాహుబలి` చిత్రంతో జాతీయ స్థాయిలో నటుడిగా విశేష గుర్తింపు తెచ్చుకున్న విసయం తెలిసిందే. ఆయన వరుసగా పాన్‌ ఇండియాసినిమాలు చేస్తూ జాతీయ, అంతర్జాతీయంగా మంచి గుర్తింపుతెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం `ఆదిపురుష్‌`లో రాముడిగా నటిస్తున్నారు ప్రభాస్‌. ఈచిత్ర ఫస్ట్ లుక్‌ని ఈ నెల 26న, టీజర్‌ని అక్టోబర్‌ 3న విడుదల చేయబోతున్నట్టు సమాచారం. అదే సమయంలో రామ్‌ లీలా మైదానంలోనిర్వహించే దసరా వేడుకలకు ప్రభాస్‌ని గెస్ట్ గా ఆహ్వానించడం విశేషం. 
 

click me!