#Rashmika: విజయ్ తో రష్మిక లవ్లీ సెల్ఫీ.. ఇంటర్నెట్‌ని ఊపేస్తున్న పిక్‌..

Published : Sep 14, 2022, 03:58 PM ISTUpdated : Sep 14, 2022, 04:00 PM IST
#Rashmika: విజయ్ తో రష్మిక లవ్లీ సెల్ఫీ.. ఇంటర్నెట్‌ని ఊపేస్తున్న పిక్‌..

సారాంశం

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా, దళపతి విజయ్‌ కలిసి దిగిన సెల్ఫీ ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతుంది.  క్యూట్‌ సెల్ఫీ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. 

దళపతి విజయ్‌, నేషన్‌ క్రష్‌ రష్మిక మందన్నా కలిసి సెల్ఫీ దిగారు. `వారసుడు` చిత్ర షూటింగ్‌ సెట్‌లో వీరిద్దరు కలిసి దిగిన ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇందులో రష్మిక, విజయ్‌ ఎంతో క్యూట్‌గా, యంగ్‌గా కనిపిస్తుండటం విశేషం. ముఖ్యంగా విజయ్‌ కుర్రాడిలా మారిపోవడంతో ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోని సోషల్‌ మీడియా ద్వారా వైరల్‌ చేస్తున్నారు. 

విజయ్‌, రష్మిక కలిసి `వారసుడు`(తెలుగులో) చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో ఇది `వరిసు` పేరుతో రూపొందుతుంది. వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా స్కేల్‌లో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. 

ప్రస్తుతం సినిమా షూటింగ్‌ హౌదరాబాద్‌లో జరుగుతుంది. హీరోహీరోయిన్లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో రష్మిక, విజయ్‌ ఇలా సరదాగా సెల్ఫీకి పోజులిచ్చారు. ఎంతో క్యూట్‌గా ఉన్న ఈ పిక్‌ అభిమానులను కట్టిపడేస్తుంది. ఇందులో రష్మిక ఆనందంతో నవ్వులు చిందిస్తుండగా, విజయ్‌ స్టయిల్‌గా చూస్తున్నారు. 

ఇదిలా ఉంటే విజయ్‌ హెయిర్‌పై మీమ్స్ పేలుతున్నాయి. విజయ్‌ తలపై చిన్న హెయిర్‌ లేకుండా చిన్న గ్యాప్‌ కనిపిస్తుంది. దీంతో ఆ సొట్టేంటంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా విజయ్‌, రష్మికల లేటెస్ట్ సెల్ఫీ సోషల్‌ మీడియాని ఊపేస్తుంది. ఇక శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. 

విజయ్‌ దీంతోపాటు లోకేష్‌ కనగరాజ్‌తో తన 67వ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే రష్మిక తమిళంలో `సుల్తాన్‌` సినిమా చేస్తుంది. మరోవైపు తెలుగులో `పుష్ప2`లో నటిస్తుంది. అలాగే బాలీవుడ్‌లో `గుడ్‌ బై`, `మిషన్‌ మజ్ను`, `యానిమల్` చిత్రాల్లో నటిస్తుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు
Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ