రష్మిక మైండ్ బ్లాక్... ఆ పాపను ఎలాగైనా కలవాలని రిక్వెస్ట్!

By Sambi ReddyFirst Published Sep 14, 2022, 4:27 PM IST
Highlights


ఓ చిన్నారి పెర్ఫార్మన్స్ చూసి రష్మిక మైండ్ బ్లాక్ అయ్యింది. ఆ పాపను ఎలాగైనా కలవాలని ఆశపడుతోంది. తన వివరాలు కావాలంటూ రిక్వెస్ట్ చేస్తుంది. 
 


పుష్ప మూవీకి దేవిశ్రీ అందించిన సాంగ్స్ విశేష ఆదరణ దక్కించుకున్నాయి. ముఖ్యంగా మాస్ డ్యూయట్ ''సామీ సామీ'' సాంగ్ బాగా పాపులర్ అయ్యింది. ఈ  పాటలో హీరోయిన్ రష్మిక ఊర మాస్ గెటప్స్ తో పాటు స్టెప్స్ ప్రేక్షకులకు పిచ్చ కిక్ ఇచ్చాయి. ఇక పుష్ప పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించగా హీరో అల్లు అర్జున్ ఫేమ్, ఆయన మేనరిజం బాగా పాపులర్ అయ్యాయి. హిందీలో పుష్ప రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో దేవిశ్రీ సాంగ్స్ కూడా దేశవ్యాప్తం అయ్యాయి. కాగా... పుష్ప మూవీలోని సామీ సామీ సాంగ్ కి ఓ మూడేళ్ళ స్కూల్ గర్ల్ డాన్స్ చేసింది. స్కూల్ యూనిఫార్మ్ లో ఉన్న ఆ కిడ్ మిగతా పిల్లలతో పాటు పుష్ప సాంగ్ కి డాన్స్ వేసింది. అయితే సామీ సామీ సాంగ్ లోని రష్మిక స్టెప్స్ దగ్గరగా అనుకరిస్తూ... ఆకట్టుకునే ఎక్స్ప్రెషన్స్ తో అదిరిపోయే పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఆ వీడియో రష్మికను ట్యాగ్ చేస్తూ ఒకరు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 

Maaaaadddddeeeeee myyyyy daaaaaay.. I want to meet this cutie..💘
how can I? 🥹 https://t.co/RxJXWzPlsK

— Rashmika Mandanna (@iamRashmika)

ఆ చిన్నారి డాన్స్ చూసిన రష్మిక ఫిదా అయిపోయారు. ఆ వీడియో ఉన్న ట్వీట్ ట్యాగ్ చేసి, 'మేడ్ మై డే... ఈ క్యూట్ బేబీని కలవాలి. ఎలాగో కొంచెం చెప్తారా?' అంటూ కామెంట్ పెట్టింది. ఇక పాప నేపాల్ కి చెందినదిగా కామెంట్స్ ద్వారా తెలుస్తుంది. ఇక ఆ అమ్మాయిని మీరు కలవాలంటే నేపాల్ వెళ్ళండి అంటూ ఒకరు కామెంట్ చేశారు. కొందరైతే నీ కంటే ఆ పాప చాలా బాగా చేసిందంటూ రష్మికను ట్రోల్ చేస్తున్నారు. ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పుష్ప 2 లో రష్మిక నటిస్తుండగా త్వరలో ఫస్ట్ షెడ్యూల్ మొదలు కానుంది. 

ఫస్ట్ పార్ట్ సక్సెస్ నేపథ్యంలో సీక్వెల్ భారీగా ప్లాన్ చేస్తున్నారు. దాదాపు రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ లో భారీ మార్పులు చేశారట. ఇక పార్ట్ 2 లో సాయి పల్లవి నటిస్తున్నట్లు వార్తలు రావడం విశేషం. అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నారట. 

click me!