ఐసీయూలో అమెరికన్ పాప్ సింగర్ మడోన్నా, తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ లో హాలీవుడ్ స్టార్..

Published : Jun 29, 2023, 12:06 PM IST
ఐసీయూలో అమెరికన్ పాప్ సింగర్ మడోన్నా,  తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ లో హాలీవుడ్ స్టార్..

సారాంశం

హాలీవుడ్ మ్యూజిక్ అభిమానులకు షాకింగ్ న్యూస్.. పాప్ సంగీత ప్రియులకు ఆరాధ్య దేవత మడోన్నా హాస్పిటల పాలు అయ్యారు. తీవ్ర అస్వస్థతతో ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. 

ప్రముఖ హాలీవుడ్  పాప్ సింగర్... సంగీత ప్రపంచపు మహారాణి  మడొన్నా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్న మడోన్నా.. అన్ని దేశాలలో అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆమె వయసు 64 ఏళ్లు. అయినా సరే ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఆమెకు ఇప్పటికి తిరుగు లేదు. అభిమానుల మనస్సులో మడోన్నాపై ప్రేమ మాత్రం  ఏమాత్రం చెక్కుచెదరలేదు. తాజాగా ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 

మడోన్నా శరీరం స్పందించని  స్థితిలో ఉండటాన్ని గమనించి.. ఆమెను  వెంటనే  న్యూయార్క్ లోని ఓ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. అయితే ఆమెకు అనారోగ్యం కలిగి కూడా ఐదురోజులు అవుతున్నట్టు తెలుస్తోంది.  గత శనివారం ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. రోజు రోజుకు ఆమె ఆరోగ్యం క్షీణించడంతో.. ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని మడొన్నా మేనేజర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
మడోన్నా తీవ్రమైన  బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కు గురైందని చెప్పారు.

అయితే నిరంతరం  ఐసీయూలో ఉంచి.. నిపుణులైన  వైద్యులు బృందంతో  చికిత్సను కొనసాగిస్తున్నారని తెలిపారు. మడొన్నా ఆరోగ్యం ప్రస్తుతం  నెమ్మదిగా మెరుగుపడుతోందని ఆయన అన్నారు. అంతే కాదు మడొన్నా అనారోగ్యానికి గురైన నేపథ్యంలో... ఆమె వరల్డ్ టూర్ తో పాటు ఇతర అన్ని కమిట్ మెంట్లను తాత్కాలికంగా ఆపేస్తున్నట్టు మేనేజర్ ప్రకటించారు. 

అంతే కాదు ఇప్పటికే మడోన్న  కొన్ని కర్యక్రమాలు కమిట్ అయ్యి ఉండటం వల్ల.. వాటిని పోస్ట్ పోన్ చేసినట్టు తెలిపారు. వరల్డ్ టూర్ తో పాటు ఇతర షోలకు సంబంధించిన.. వివరాలు..  కొత్త తేదీలను తర్వాత ప్రకటిస్తామని ఆమన తెలిపారు. ఇక హాస్పిటల్ లో మడోన్నాను ఎప్పటికప్పుడు వెంటే ఉంటూ.. ఆమె కూతురు  లియోన్ చూసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ వివరాలకు సబంధించిన కథనాలు హాలీవుడ్ కు చెందిన 'పేజ్ సిక్స్' పత్రిక తాజాగా వెల్లడించింది. 
 

PREV
click me!

Recommended Stories

Thanuja: ఇదీ తనూజ అసలు స్వరూపం, విన్నర్ అయ్యే ఛాన్స్ గోవిందా.. ఆమెకి ఎలివేషన్స్ ఇచ్చి వేస్ట్
Raktha Sambandham Review : ఎన్టీఆర్, సావిత్రి.. అన్నా చెల్లెలుగా నటించే సాహసం ఎలా చేశారు? ఆడియన్స్ ను ఏడిపించిన మహానటి