Vijay Sethupathi: విజయ్‌ సేతుపతిని తంతే 1001 బహుమతి.. నెట్టింట దుమారం..

Published : Nov 08, 2021, 09:56 PM IST
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతిని తంతే 1001 బహుమతి.. నెట్టింట దుమారం..

సారాంశం

హిందూ మతతత్వ సంస్థ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఇప్పుడు మరింత వివాదాస్పదంగా మారింది. హిందూ మక్కల్‌ కట్చి అనే సంస్థ విజయ్‌ సేతుపతిని తన్నిన వారికి రూ. 1001 బాహుబతిగా ఇస్తామని ప్రకటించి దుమారం రేపుతున్నారు. 

తమిళ విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి(Vijay Sethupathi) వీడియో ఒకటి ఇటీవల వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ లో వెనకాల నుంచి ఓ వ్యక్తి ఎగిరి తన్నినట్టుగా ఉన్న వీడియో చక్కర్లు కొట్టింది. అయితే దీన్ని చిన్న గొడవగా కొట్టిపారేశాడు Vijay Sethupathi. వెంటనే సమస్యని సాల్వ్ చేసినట్టు, ఓ ప్రయాణికుడికి, తన అసిస్టెంట్ కి మధ్య గొడవ అని రాజీకుదిర్చినట్టు వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ఈ వివాదం మరింత దుమారం రేపుతుంది. హిందూ మతతత్వ సంస్థ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఇప్పుడు మరింత వివాదాస్పదంగా మారింది. 

హిందూ మక్కల్‌ కట్చి అనే సంస్థ విజయ్‌ సేతుపతిని తన్నిన వారికి రూ. 1001 బాహుబతిగా ఇస్తామని ప్రకటించి దుమారం రేపుతున్నారు.  స్వాతంత్ర్య సమరయోధుడు దైవతిరు పసుంపోన్‌ ముత్తురామలింగ తేవర్‌ అయ్యని, దేశాన్ని అవమానించేలా వ్యాఖ్యానించాడని,  దీనికి సంబంధించిన కొన్ని స్క్రీన్‌ షాట్లని పోస్ట్ చేసింది. `తేవర్ అయ్యని అవమానించిందుకు విజయ్‌ సేతుపతిని తన్నినందుకు హిందూ మక్కల్‌ కట్చి సంస్థకి చెందిన అర్జున్‌ సంపత్‌ నగదు బహుమతిని ప్రకటించారు. విజయ్‌ సేతుపతిని ఒక్క కిక్కి రూ.1001 ఇస్తామని ప్రకటించాడ`ని హిందూ మక్కల్ కట్చి పేర్కొంది. 

దీనిపై అర్జున్‌ సంపత్ మాట్లాడుతూ, తాను ఇలాంటి స్టేట్‌మెంట్‌ ఇచ్చిన మాట నిజమే అని, విజయ్‌ సేతుపతిని తన్నడానికి ప్రయత్నించిన వ్యక్తి మహాగాంధీతో తాను మాట్లాడానని, విజయ్‌ సేతుపతి అతనితో చాలా హేళనగా మాట్లాడాడని, అది వాగ్వాదానికి దారి తీసిందన్నారు. `విజయ్‌ సేతుపతికి జాతీయ అవార్డు వచ్చినందుకు అతను విషెస్‌ చెప్పాలనుకున్నాడని, కానీ విజయ్‌ వ్యంగ్యంగా స్పందించాడని, అసలు ఇది దేశం కాదన్నాడని తెలిపాడు. మీరు సౌత్‌ నుంచి వచ్చారు. పసుంపోన్‌కు హాజరు కావాలని పిలవగా, ప్రపంచంలో ఏకైకా దేవుడు జీసస్‌ మాత్రమే అని విజయ్‌ చెప్పాడని, అందుకే అతను అలా రియాక్ట్ అయ్యాడ`ని అర్జున్‌ సంపత్‌ తెలిపారు. అందుకే తాను ఈ నగదు బహుమతి ప్రకటించినట్టు తెలిపారు. 

అయితే దీనిపై విజయ్‌ సేతుపతి అభిమానులు తీవ్రంగా స్పందించారు. సదరు సంస్థపై, అర్జున్‌ సంపత్‌పై ఫైర్‌ అవుతున్నారు. అభిమాన నటుడిని కించపరిచేలా వ్యవహరిస్తుండటం పట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హిందూ మక్కల్‌ కట్చి సంస్థకి వ్యతిరేకంగా కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఇప్పుడిది పెద్ద వివాదం మారింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. విజయ్‌ సేతుపతి ఇటీవల `ఉప్పెన` సినిమాతో తెలుగు ఆడియెన్స్ ని మెప్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పదికిపైగా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. 

also read : Samantha: సమంతకి అరుదైన గౌరవం.. `ఇఫీ`లో స్పీకర్‌గా.. తొలి దక్షిణాది నటి

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే