Samantha: సమంతకి అరుదైన గౌరవం.. `ఇఫీ`లో స్పీకర్‌గా.. తొలి దక్షిణాది నటి

Published : Nov 08, 2021, 09:12 PM IST
Samantha: సమంతకి అరుదైన గౌరవం.. `ఇఫీ`లో స్పీకర్‌గా.. తొలి దక్షిణాది నటి

సారాంశం

52వ ఇఫీ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు సమంతకి ఆహ్వానం పంపింది `ఐఎఫ్‌ఎఫ్‌ఐ`. సమంతని స్పీకర్‌గా పాల్గొనాల్సి ఉందని ఇఫీ ఆహ్వానించింది. ఆ మేరకు సమంతని ఎంపిక చేశారు ఇఫీ నిర్వహకులు. 

సమంత(Samantha)కి అరుదైన గౌరవం దక్కింది. గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనే అరుదైన అవకాశం దక్కింది. ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఆఫ్‌ ఇండియా(ఇఫీ) 2021 (52nd International Film Festival of India) కిగానూ గోవాలో జరగబోతుంది. 20న ప్రారంభమవుతున్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌ నవంబర్‌ 28 వరకు తొమ్మిది రోజులపాటు జరుగబోతుంది. ఈ ఫెస్టివల్‌లో తెలుగు నుంచి `నాట్యం`(Natyam) సినిమా ఎంపికైన విషయం తెలిసిందే. ఇండియన్‌ పనోరమా సెక్షన్‌లో ప్రదర్శించబడుతుంది. అవార్డు కోసం పోటీ పడుతుంది. 

ఈ 52వ ఇఫీ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు Samanthaకి ఆహ్వానం పంపింది `ఐఎఫ్‌ఎఫ్‌ఐ`. సమంతని స్పీకర్‌గా పాల్గొనాల్సి ఉందని ఇఫీ ఆహ్వానించింది. ఆ మేరకు సమంతని ఎంపిక చేశారు ఇఫీ నిర్వహకులు. అయితే ఈ ఇఫీ(Iffi) ఈవెంట్‌లో స్పీకర్‌గా ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది నటిగా సమంతకి ఆహ్వానం రావడం విశేషం. ఇది ఆమెకి దక్కిన అరుదైన గౌరవమని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇందులో వ్యాఖ్యాతగా సమంతతోపాటు మనోజ్‌ భాజ్‌పాయ్‌ కూడా ఎంపికయ్యారు. వీరితోపాటు  ప్రముఖ దర్శకుడు అరుణా రాజే, నటుడు జాన్ ఎడతత్తిల్, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిలకు కూడా ఆహ్వానం అందింది. 

సమంత.. నాగచైతన్యతో విడిపోతున్నట్టు గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగేళ్ల వివాహ బంధానికి అక్టోబర్‌ 2న ముగింపు పలికారు. విడిపోవడానికి కారణాలు పూర్తిగా వ్యక్తిగతమని చెప్పిన సమంత ఆ తర్వాత అనేక అవమానాలను, ఒత్తిడిని ఎదుర్కొంది. మానసికంగా ఒత్తిడికి గురైన ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఫ్రెండ్స్ తో ఎంజాయ్‌ చేస్తూ ఆ బాధ నుంచి బయటపడే ప్రయత్నం చేస్తుంది. 

అయితే అదే సమయంలో వరుసగా సినిమాలతో జోరు పెంచింది సమంత. ఇప్పటికే రెండు సినిమాల్లో నటించిన ఆమె, దసరా సందర్భంగా మరో రెండు సినిమాలను ప్రకటించారు. రెండు బైలింగ్వల్‌ సినిమాలు కావడం విశేషం. మరోవైపు బాలీవుడ్‌లోకి కూడా అడుగులు వేస్తుందట. షారూఖ్‌ ఖాన్‌-అట్లీ చిత్రంలో సమంత ఫైనల్‌ అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు సమంత పారితోషికం పెంచిందట. గతంలో రెండు కోట్లు డిమాండ్‌ చేసే సమంత ఇప్పుడు మూడు నాలుగు కోట్లకుపైగానే తీసుకుంటుందని ఓ వార్త వైరల్‌ అవుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

also read: Akhanda Title Song: అబ్బురపరిచే విజువల్స్.. బాలయ్యని చూస్తూ, లిరిక్స్ వింటూ మరో కొత్త లోకంలోకి..

ప్రస్తుతం సమంత తెలుగులో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం `శాకుంతలం` చిత్రంలో శాకుంతలగా నటించింది. గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. మరోవైపు తమిళంలో విజయ్‌ సేతుపతి, నయనతారలతో కలిసి `కాథు వాకులు రెండు కాదల్‌` చిత్రంలో నటించింది. దీనికి నయనతార ప్రియుడు విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహించడం విశేషం. ఈ సినిమా కూడా రిలీజ్‌కి రెడీగా ఉంది.

also read: సమంత సీరియస్ లుక్ చూశారా.. స్టన్నింగ్ ఫోటోస్ వైరల్
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే
ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్