అడ్వొకేట్ సహా వస్తానన్న ఛార్మి వినతిని తోసిపుచ్చిన హైకోర్టు

Published : Jul 25, 2017, 03:15 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
అడ్వొకేట్ సహా వస్తానన్న ఛార్మి వినతిని తోసిపుచ్చిన హైకోర్టు

సారాంశం

చార్మి పిటిషన్ పై హైాకోర్టు తీర్పు అనుమతి లేకుండా సిట్ శాంపిల్స్ తీసుకోవద్దు-హైకోర్టు చార్మిని మహిళా అధికారులే విచారించాలి-హైకోర్టు చార్మి అడ్వకేట్ తో విచారణకు వెళ్లడం కుదరదు-హైాకోర్టు

గత కొన్ని వారాలుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులో సినీ నటి ఛార్మి హైకోర్టును ఆశ్రయించింది. సిట్ దర్యాప్తు తీరు సరిగా లేదని పిటిషన్ వేసింది ఛార్మి. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తొలుత విచారణకు సిట్ కార్యాలయానికే వస్తానని తెలిపిన ఛార్మి.. సడెన్ గా  యు టర్న్ తీసుకుని హైకోర్టును ఆశ్రయించడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

 

ఇక ఛార్మి పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు ఇరు పక్షాల వాదోపవాదాలు పరిశీలించింది. కేవలం సిట్  విచారణను తప్పుదోవ పట్టించేందుకే చార్మి పిటిషన్ వేసిందని సిట్ వాదించింది. సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేయట్లేదని చెప్పింది. కేవలం పబ్లిసిటీ స్టెంట్ తప్ప పిటిషన్ వేయటానికి మరో కారణం లేదని సిట్ వాదించింది. పూరీ జగన్ ఇష్టపూర్వకంగానే శాంపిల్స్ ఇచ్చారని సిట్ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. హైాదరాబాద్ డ్రగ్స్ విషయంలో ముంబైలా మారుతోందని సిట్ లాయర్ వాదించారు.

 

ఇక ఛార్మి లాయర్ కూడా వాదనలు బలంగానే వినిపించారు. ఛార్మి నిందితురాలు కాదని, కనీసం సాక్షి కూడా కాదని.. అలాంటప్పుడు శాంపిల్స్ తనకు ఇష్టం లేకుండా ఎలా ఇస్తారని చార్మి లాయర్ వాదించారు.   ఆర్టికల్ 20 ప్రకాలం చార్మిని స్వేచ్ఛాయుత వాతావరణంలో విచారించాలని లాయర్ కోర్టుకు విన్నవించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఈ మధ్యాహ్నం 2.30గంటలకు తీర్పు వెల్లడించింది.

విచారణ ఎదుర్కోవాల్సినంది మహిళ కాబట్టి ఆమె కోరిన చోట విచారిస్తే మేలని హైకోర్టు సూచించింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా.. ఛార్మి సిట్ కార్యాలయానికే విచారణకు హాజరైతే బాగుంటుందని.. లాయర్ విష్ణు వర్దన్ రెడ్డి సూచిస్తున్నారు. ఇక అవసరమైతే మరో రోజు విచారించుకోండి కానీ.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు మధ్య మాత్రమే విచారించాలని సిట్ కు సూచించింది హైకోర్టు. ఈ నేపథ్యంలో చార్మి విచారణ నిమిత్తం సిట్ కార్యాలయానికి వస్తుందా లేక మరో చోట విచారణకు హాజరవుతుందా అనేది చూడాలి.

హైకోర్టు మాత్రం చార్మి విచారణకు హాజరు కావాల్సిందేనని, తోడుగా అడ్వకేట్ ను వెంటబెట్టుకుని వెళ్లడానికి అనుమతివ్వబోమని స్పష్టం చేసింది. అంతేకాక చార్మి ఒక మహిళ కాబట్టి.. మహిళాధికారులే విచారించాలని కోర్టు సూచించింది. ఇక అనుమతి లేకుండా సిట్ చార్మి శాంపిల్స్ తీసుకోకూడదని కోర్టు స్పష్టం చేసింది.

PREV
click me!

Recommended Stories

త్రిష ,కాజల్ తో పాటు బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్లుగా కెరీర్ మొదలుపెట్టిన, 8 మంది స్టార్స్ ఎవరో తెలుసా?
Nari Nari Naduma Murari మూవీపై బాలకృష్ణ క్రేజీ రియాక్షన్‌.. శర్వానంద్‌ బతికిపోయాడు