Bigg Boss Telugu 5; బిగ్‌బాస్‌ ఇచ్చిన సర్‌ప్రైజ్‌కి ఎమోషనలైన శ్రీరామ్‌, మానస్‌.. గ్రాండ్‌ వెల్ కమ్‌

By Aithagoni RajuFirst Published Dec 13, 2021, 11:51 PM IST
Highlights

కాజల్‌ ఎలిమినేషన్‌తో టాప్‌ 5 ఫైనలిస్ట్ లు ఫైనల్‌ అయ్యారు. సన్నీ, శ్రీరామ్‌, షణ్ముఖ్‌, సిరి, మానస్‌ ఇప్పుడు టాప్‌ 5 కంటెస్టెంట్లు గా ఉన్నారు. వీరిలో విన్నర్‌ ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

బిగ్‌బాస్‌ తెలుగు 5(Bigg Boss Telugu 5)వ సీజన్‌ చివరి వారానికి చేరుకుంది. వచ్చే ఆదివారంతో షో పూర్తి కానుంది. సోమవారంతో చివరి వారమైన 15వ వారం ప్రారంభమైంది. కాజల్‌ ఎలిమినేషన్‌తో టాప్‌ 5 ఫైనలిస్ట్ లు ఫైనల్‌ అయ్యారు. సన్నీ, శ్రీరామ్‌, షణ్ముఖ్‌, సిరి, మానస్‌ ఇప్పుడు టాప్‌ 5 కంటెస్టెంట్లు గా ఉన్నారు. వీరిలో విన్నర్‌ ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో Bigg Boss Telugu 5 సోమవారం ఎపిసోడ్‌లో ఫైనలిస్ట్ లకు గ్రాండ్‌గా వెల్‌కమ్‌ పలికారు బిగ్‌బాస్‌. 

అందులో భాగంగా హౌజ్‌లో బిగ్‌బాస్‌ వంద రోజుల జర్నీలో వారి తీపి గుర్తులను ఫోటోలుగా క్యాప్చర్‌ చేసి ఫ్రేములగా అంటించారు. అవి చూసి ఫైనలిస్ట్ లు ఆనందం వ్యక్తం చేస్తూ ఎమోషనల్‌ అయ్యారు. అందులో భాగంగా ఒక్కొక్కరికి బిగ్‌బాస్‌ వెల్‌కమ్‌ పలికారు. మొదటగా శ్రీరామ్‌(Sreeram)ని ఆహ్వానించారు బిగ్‌బాస్‌. హాల్‌ హౌజ్‌లో అందంగా డెకరేట్‌ చేసిన తన ఫోటోలను చూసుకుని ఆయన మురిసిపోయారు. ఇతర హౌజ్‌మేట్స్ తో ఉన్న పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. వాటిని చూస్తూ తన్మయత్వం చెందారు. ఆ తర్వాత హౌజ్‌లో వారి జర్నీని చూపించారు. దీనికి ఎమోషనల్‌ అయ్యారు Sreeram. ఫైనల్‌గా గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెబుతూ అద్భుతమైన ఇన్ స్పైరింగ్‌ వర్డ్స్ చెప్పారు బిగ్‌బాస్‌. 

గాయకుడిగా ఎంతో మందికి దగ్గరైన నువ్వు బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి ఒంటరిగా ఎంటరయ్యావని, మరో ప్రపంచంలోకి వచ్చి నువ్వు నిన్ను తెలుసుకున్నావని, ఆ తర్వాత ఇతరులకు దగ్గరయ్యావని, చాలా మందిని ఫ్రెండ్స్ గా చేసుకున్నావని చెప్పారు. టాస్క్ ఏదైనా చాలా వరకు ఒంటరిగానే పోరాడావని, తన పోరాటపటిమని ఈ సందర్భంగా బిగ్‌బాస్‌ అభినందించారు. మొదటి ఫైనలిస్ట్ గా నిలిచిన శ్రీరామ్‌ని అభినందించారు బిగ్‌బాస్‌. ఈ సందర్భంగా ఆయనకు గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెబుతూ ఆల్‌ దిబెస్ట్ చెప్పారు. హౌజ్‌లో ఉన్న ఫోటోల్లో ఇష్టమైన పిక్ ని తీసుకోమని చెప్పగా, తన సిస్టర్‌తో ఉన్న పిక్‌ని తీసుకున్నాడు శ్రీరామ్‌. 

ఆ తర్వాత మానస్‌(Maanas)ని సెపరేట్‌గా పిలిచారు బిగ్‌బాస్‌. హాల్‌ హౌజ్‌ లో ఆయన ఫోటోలతో డెకరేట్‌ చేశారు. మానస్‌ హౌజ్‌లోకి వచ్చినప్పటి నుంచి ఆదివారం ఎపిసోడ్‌ వరకు అనేక తీపి గుర్తులను కాప్చర్‌ చేసి ఫోటోల రూపంలో బంధించారు. అక్కడ ప్రజెంట్‌ చేశారు. అవి చూసి మానస్‌ సైతం చాలా ఆనందించారు. ఆయన ఆనందానికి అవద్దుల్లేవని చెప్పొచ్చు. ఆ తర్వాత జర్నీని చూపించగా Maanas భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం నంతరం మానస్‌ గురించి పలు ఇన్‌స్పైరింగ్‌ వర్డ్స్ చెప్పారు బిగ్‌బాస్. 

అమ్మకి ముద్దుల కొడుకుగా బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి వచ్చావని, ఇంటిలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జర్నీ చాలా కొత్తగా, స్పెషల్‌గా నిలిచిందన్నారు. మీ ఓర్పు, అందరిని అర్థం చేసుకునే తత్వం తనని ప్రత్యేకంగా నిలిపిందన్నారు. స్నేహానికి మీరిచ్చే విలువు,స్నేహం కోసం నిలబడ్డ తీరు హత్తుకునేలా ఉందన్నారు. హౌజ్‌లో ఎన్నో కొత్త బంధాలను ఏర్పర్చుకున్నారని, మనసు నొప్పించక సున్నితంగా చెప్పడం,అవసరమైతే గొంతెత్తి గట్టిగా నిలదీయడం మీ ప్రత్యేకత అని చెప్పారు. తెలివి, మనసుని కలిపి ఉపయోగించడం మీకు సాధ్యమైందన్నారు. అదే ఇక్కడి వరకు తీసుకొచ్చిందని, ఫైనలిస్ట్ గా చేసిందని చెప్పారు. మున్ముందు సాధించే విజయాలకు, జర్నీకి బిగ్‌బాస్‌ అభినందనలు తెలిపారు. చివరగా ఇష్టమైన పిక్‌ తీసుకోవాలని చెప్పగా, మానస్‌ రెండు ఫోటోలను తీసుకుని వెళ్లారు. ఇంతటితో సోమవారం ఎపిసోడ్‌ పూర్తయ్యింది. రేపు(మంగళవారం) మిగిలిన వారికి వెల్‌కమ్‌ చెబుతూ జర్నీని చూపించనున్నారు బిగ్‌బాస్‌. 

also read: Rashmika Mandanna: తన టాటూ సీక్రెట్‌ రివీల్‌ చేసిన రష్మిక.. అర్థం తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే

click me!