ఆదిపురుష్ మేకర్స్ పై హైకోర్ట్ అసహనం, సెన్సార్ బోర్డ్ పై సీరియర్ అయిన ధర్మాసనం..

Published : Jun 28, 2023, 09:38 AM IST
ఆదిపురుష్ మేకర్స్ పై హైకోర్ట్ అసహనం, సెన్సార్ బోర్డ్ పై సీరియర్ అయిన ధర్మాసనం..

సారాంశం

ఆదిపురుష్ సినిమాను వివాదాలు వదలడంలేదు. రిలీజ్ కు ముందు నుంచే ఇబ్బందులు ఫేస్ చేస్తూ.. వస్తోన్న ఈ సినిమా.. రిలీజ్ తరువాత కూడా కష్టాలు ఎదురుకోక తప్పడం లేదు.   

దేశ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది ప్రభాస్ ఆదిపురుష్ సినిమా. రిలీజ్ ముందు నుంచే వివాదాల మధ్య నలిగిన ఈ సినిమా.. రిలీజ్ అయిన తరువాత కూడా తీవ్రస్తాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది.  రామాయణం ఇతిహాసం ఆధారంగా దర్శకుడు ఓంరౌత్ తీర్చిదిద్దిన ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి.. సినీ ప్రముఖుల వరకు అనేక విమర్శలు వచ్చాయి. ఓవైపు బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబడుతున్నప్పటికీ.. ఓంరౌత్ రామాయణాన్ని అవమానించారంటూ రాద్దాంతం స్టార్ట్ చేశారు. 

ఈ సినిమాలో కొన్ని సీన్లు రామాయాణాన్ని అవమానించేలా ఉన్నాయంటూ  ఆరోపణలు గుప్పుమంటున్నాయి.  ఈసినిమాలో రాముడికి మీసాలు ఉండటం, రావణాసురుడు బొట్టులేకుండా ఉండటం, వేషధారణలు, మూవీలోని  కొన్ని సన్నివేశాలు.. డైలాగ్స్ రామాయాణానికి విరుద్ధంగా తీర్చిదిద్దారనే ఆరోపించారు. ఆదిపురుష్ లో.. రాముడిగా  ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, దేవ దత్తా ప్రధాన పాత్రలు పోషించారు. 

ఇక ఈసినిమా ఎన్ని రకాలుగా ఆలోచించినా.. రామాయానికి విరుద్దంగానే ఉంది అంటూ ఆరోపించడంతో పాటు.. ఈమూవీని వెంటనే నిలిపివేయాలంటూ.. కోర్టుల్లో కేసులు.. పోలీస్ స్టేషన్స్ లో కంప్లైంట్స్ ఎక్కువైపోయాయి.ఇక ఈ సినిమాలోని పలు డైలాగ్స్ తొలగించాలంటూ అలహాబాద్ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై  విచారణ జరిగింది. ఈ సందర్బంగా హైకోర్టు ఆదిపరుష్ టీమ్ పై అసహనం వ్యాక్తం చేయడంతో పాటు.. సెన్సార్ బోర్డ్ తీరుని తప్పుబట్టింది.

సెన్సార్ కు పంపిన సమయంలో ఇలాంటి డైలాగ్స్ ను ఎందుకు సమర్థించారని కోర్టు ప్రశ్నించింది. ఈ సినిమాలోని డైలాగ్స్, సన్నివేశాల వల్ల భవిష్యత్తు తరాలకు ఎలాంటి సందేశాలను అందించాలనుకుంటున్నారని మేకర్స్ పై కోర్ట్  సీరియస్ అయ్యింది. అంతే కాదు ఈకేసు విచారణ కొనసాగుతున్న టైమ్ లో .. డైరెక్టర్ తో పాటు ప్రొడ్యూసర్ కూడా హాజరుకాకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది ధర్మాసనం. 

ఆదిపురుష్ సినిమాలో  హనుమ చెప్పే ఓ డైలాగ్ పై సినీప్రముఖులు, ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చిత్రయూనిట్ వెనక్కు తగ్గి డైలాగ్స్ మార్చింది. అయినప్పటికీ ఈ సినిమాపై విమర్శలు తగ్గడం లేదు. ఈ సినిమాకు మనోజ్ ముంతాషిర్ డైలాగ్స్ రాశారు. దాంతో ఆయనకు నోటీసులు జారీ చేసిందికోర్ట్.  ఇక  ఇక అదే సమయంలో తాము అసలు రామాయణాన్ని తెరకెక్కించలేదని.. కేవలం ఆధారంగా మాత్రమే తీసుకున్నామని రచయిత మనోజ్ ముంతాషిర్ అనడం మరిన్ని వివాదాలకు దారి తీసింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rithu Chowdary: అంతా నా కర్మ, మోసం చేసి మరో అమ్మాయితో వెళ్ళిపోయాడు.. కెరీర్ కోసమే నవ్వుతూ బతుకుతున్నా
Parthiban Controversy:చిక్కుల్లో పడ్డ ఉస్తాద్ విలన్.. పవన్ కళ్యాణ్ ముందే అలాంటి వ్యాఖ్యలు, వైరల్