నయనతారతో వన్స్ మోర్ అంటున్న బాలకృష్ణ, బాలయ్య కోసం డేట్లు సర్ధుబాటు చేసిన నయన్..?

Published : Jun 28, 2023, 08:40 AM IST
నయనతారతో వన్స్ మోర్ అంటున్న బాలకృష్ణ, బాలయ్య కోసం డేట్లు సర్ధుబాటు చేసిన నయన్..?

సారాంశం

ఇప్పటికే హ్యాట్రిక్ పెయిర్ గా రచ్చ చేసిన బాలయ్య - నయనతార జంట మరోసారి వెండితెరపై సందడి చేయబోతోందా..? బాలయ్య కోసం నయనతార డేట్లు సర్థుబాటు కూడా చేసిందా..? వైరల్ అవుతున్న న్యూస్ లో నిజం ఎంత...?   

బాలయ్య బాబు దూసుకుపోతున్నాడు వరుస సినిమాలతో రచ్చ రచ్చ చేస్తున్నాడు. యంగ్ స్టార్స్ కూడా చేయలేని విధంగా సినిమాలు చేస్తూ..  వరుస సక్సెస్ లు తన ఖాతాలు వేసుకుంటున్నాడు. ఈక్రమంలో బాలయ్యకు జోడీగా పర్ఫెక్ట్ అనిపించుకున్న సీనియర్ హీరోయిన్ నయనతార.. మరోసారి బాలకృష్ణ సరసన మెరవబోతున్నట్టు తెలుస్తోంది. 

తమిళంలో వరుస సినిమాలు చేసుకుంటూ.. బిజీ బిజీగా ఉంది నయనతార. ఏజ్ పెరుగుతున్నా కొద్ది ఆమె క్రేజ్ కూడా అంతే పెరుగుతోంది. కోలీవుడ్ లోఅంత బిజీగా ఉన్నా.. తెలుగులో మాత్రం నయనతార.. సీనియర్ స్టార్ హీరోలకు మాత్రమే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తోంది. ముఖ్యంగా బాలయ్యతో సినిమా అంటే ఎంత బిజీలో ఉన్నా సరే.. డేట్స్ సర్దుబాటు చేస్దుంది బ్యూటీ. టాలీవుడ్ లో ముఖ్యంగా ఆమె ఇక్కడ చిరంజీవి - బాలకృష్ణ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ వెళుతోంది. తాజాగా ఆమె మరోసారి బాలకృష్ణ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనేది సమాచారం. 

ప్రస్తుతం బాలయ్య తన 108వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నారు. 'భగవంత్ కేసరి' టైటిల్  తో తెరకెక్కుతున్న ఈమూవీ షూటింగ్ త్వరలోనే గుమ్మడికాయ కొట్టబోతున్నారు. ఇక ఈ ఏడాది దసరాకు ఈసినిమా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇక ఇది సెట్స్ పైన ఉండగానే.. బాబీ డైరెక్షన్ లో బాలయ్య మరో సినిమాను స్టార్ట్ చేశారు. ఈసినిమా ఓపెనింగ్ చాలా గ్రాండ్ గా జరగింది. ఇక షూటింగ్ మాత్రం ఇంకా స్టార్ట్ కాలేదు. 

ఇక ఈసినిమాలో బాలయ్య జోడీగా.. నయనతారను తీసుకున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు  చోటు ఉందనేది టాక్. ఒక కథానాయికగా నయనతారను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 'సింహా' .. శ్రీరామరాజ్యం' .. 'జై సింహా' తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో సెట్స్ పైకి వెళుతున్న సినిమా ఇది. అయితే ప్రస్తుతం తమిళ్ లో బిజీగా ఉన్న నయనతార.. ఈసినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా బాలయ్య కోసం డేట్లు కూడా సర్ధుబాటు చేసిందట.  ఇక ఈమూవీకోసం  మరో హీరోయిన్ గా రకుల్ .. సంయుక్త మీనన్ పేర్లను పరిశీలిస్తున్నారట. సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

రాజకీయాల్లో సంచలనాలకు తెరలేపబోతున్న త్రిష, పవన్‌ కళ్యాణ్‌ స్ట్రాటజీ.. తెరవెనుక విజయ్‌ చక్రం తిప్పుతున్నాడా?
Brahmamudi Serial Today Episode: బైక్ కోసం తమ్ముడిని ఇరికేంచేసిన రాజు, ఇందును అవమానించిన ఐశ్వర్య