సల్మాన్ ఖాన్ ను వదిలేది లేదు, ఎలాగైనా చంపేస్తామంటూ.. గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్ హెచ్చరిక

Published : Jun 28, 2023, 07:51 AM ISTUpdated : Jun 28, 2023, 07:54 AM IST
సల్మాన్ ఖాన్ ను వదిలేది లేదు, ఎలాగైనా చంపేస్తామంటూ.. గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్ హెచ్చరిక

సారాంశం

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను వదిలేది లేదంటున్నారు గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్. బాలీవుడ్ హీరోను చంపేవరకూ తమకు ప్రశాంతత లేదన్నారు. తాజా ఇంటర్వ్యూలో సంచలన నిజాలు వెల్లడించాడు గోల్డీ. 

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను వివాదాలు వదిలిపెట్టడం లేదు. ఆయన తెలిసీతెలియక చేసిన తప్పులు, తెలిసి చేసిన కొన్ని పొరపాట్లు ప్రస్తుతం సల్మాన్ కునరకం చూపిస్తున్నాయి. ఇప్పటికే పలు కేసుల్లో ఇబ్బందిపడిన సల్మాన్ ఖాన్.. ఇప్పుడు ప్రాణ భయంతో  ఉన్నారు. చుట్టూ సెక్కూరిటీని వేసుకుని తిరుగుతున్నారు. ప్రభుత్వం కూడా ఆయనకు రక్షణ కల్పించింది. ఇక  సల్మాన్‌ఖాన్‌ను ఎలా అయినా చంపి తీరుతామని కెనడాకు పారిపోయిన గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్ హెచ్చరించాడు. ‘ఇండియా టుడే’కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో గోల్డీబ్రార్ మాట్లాడుతూ ఈ హెచ్చరికలు జారీ చేశాడు. 

కొద్ది కాలంగా సల్మాన్‌ ఖాన్ ను చంపేస్తామంటూ బెదిరింపు మెసేజ్ లు బాగా వచ్చాయి. ఇక చాలా కాలంగా తమ శత్రువుగా ఉన్న సల్మాన్ ఖాన్ ను కూడా  చంపేస్తామంటూ ఆయన అనుచరులు ఇప్పటికే పలుమార్లు ఈమెయిళ్ల ద్వారా హెచ్చరించారు. గతేడాది మేలో జరిగిన పంజాబీ సింగర్, రాజకీయ నాయకుడు సిద్దూ మూసేవాలా హత్యకేసు ప్రధాన సూత్రధారి గోల్డీబ్రారేనని పోలీసులు భావిస్తున్నారు.

ఇండియా టుడెకు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం అతను ఏం చెప్పాడంటే..? మేం సల్మాన్‌ఖాన్ చంపేస్తాం. తప్పకుండా చంపి తీరుతాం. తాను క్షమించబోనని లారెన్స్ బిష్ణోయ్ ఇప్పటికే తేల్చి చెప్పడంతో పాటు.. మీకు క్లారిటీ కూడా ఇచ్చారు. బాబా కరుణిస్తేనే ఆయన దయతలుస్తాడు’’ అని బ్రార్ చెప్పుకొచ్చాడు. సల్మాన్‌‌ను చంపడమే తన జీవిత లక్ష్యమని జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను గుర్తు చేస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశాడు. 

సల్మాన్‌ఖాన్ ఒక్కడే కాదు.. మేం బతికున్నంత కాలం మా శత్రువుల అందరిపైనా దాడులు చేస్తూనే ఉంటాం. సల్మాన్‌ఖాన్ మా లక్ష్యం. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. మేం ప్రయత్నిస్తూనే ఉంటాం. విజయం సాధించినప్పుడు మీకు తెలుస్తుంది’’ అని బ్రార్ నొక్కి చెప్పాడు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

రాజకీయాల్లో సంచలనాలకు తెరలేపబోతున్న త్రిష, పవన్‌ కళ్యాణ్‌ స్ట్రాటజీ.. తెరవెనుక విజయ్‌ చక్రం తిప్పుతున్నాడా?
Brahmamudi Serial Today Episode: బైక్ కోసం తమ్ముడిని ఇరికేంచేసిన రాజు, ఇందును అవమానించిన ఐశ్వర్య