సూపర్ స్టార్ దిలీప్ కు కేరళ హైకోర్టులో చుక్కెదురు

First Published Jul 24, 2017, 8:28 PM IST
Highlights
  • నటి భావన కేసులో అరెస్టయిన మళయాల సూపర్ స్టార్ దిలీప్
  • బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన దిలీప్
  • దిలీప్ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన హైకోర్టు

ప్రముఖ మళయల నటి భావన పై పల్సర్ సునీల్, ఆమె డ్రైవర్ మరో నిందితనితో కలిసి లైంగిక వేధింపులకు గురి చేసిన విషయం అప్పట్లో పెద్ద సంచలనం అయ్యింది.  దీనిపై నటి భావనకు మద్దతుగా మళియాళ ఇండస్ట్రీతో పాటు అన్ని సినిమా ఇండస్ట్రీలో సపోర్ట్ చేశాయి.  మొత్తానికి ఈ కేసులో ప్రధాన నింధితుడు సునీల్ కుమార్ అలియాస్ పల్సర్ సునీల్ ని పోలీసులు అరెస్టు చేశారు.  

 

ఆ తర్వాత ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు మరికొన్ని షాకింగ్ నిజాలు తెలిశాయి.  నటి భావన పై వ్యక్తిగత కక్ష్య తీర్చుకునే నేపథ్యంలో మళయాల సినీ నటుడు దిలీప్ ఈ కుట్ర పన్నాడని... ఈ కేసులో అరెస్టు అయిన నిందితుడు సునీల్ కుమార్ అలియాస్ పల్సర్ సునీ అంగీకరించాడని పోలీసులు కోర్టులో చెప్పారు.  దీంతో దిలీప్ ని అరెస్టు చేశారు పోలీసులు. అప్పటి నుంచి ఎన్నో కీలక విషయాలు బయట పడుతూనే ఉన్నాయి.  

 

ఇక దిలీప్ బెయిల్ కోసం దరఖాస్తు పెట్టుకోగా.. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతనికి బెయిల్ ఇస్తే రాజకీయంగా, డబ్బు ప్రభావంతో సాక్షాలు తారుమారు చేసే అవకాశం ఉందని  కోర్టులో చెప్పారు. మరోవైపు దిలీప్ తరుపు న్యాయవాది ఈ కేసులో అతనికి ఏమాత్రం ప్రమేయం లేదని వాదిస్తున్నారు.  

 

ఇరు వర్గాల వాదన విన్న కేరళ హైకోర్టు గత నాలుగు రోజులుగా పోలీసులు సేకరించిన సాక్షాలు పరిశీలించింది. సోమవారం కేరళ హైకోర్టు దిలీప్ కు బెయిల్ ఇవ్వడం కుదరదని చెప్పింది.  దీంతో దిలీప్ ఇప్పుడు సుప్రీం కోర్టును ఆశ్రయించడానికి సిద్దం అయ్యాడు. 

 

click me!