
నితిన్ హీరోగా.. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మరియు శ్రేష్ట్ మూవీస్ బేనర్ లపై సంయుక్తంగా చిత్రం తెరకెక్కించనున్నారు. త్రివిక్రమ్ కథను అందించిన ఈ మూవీ ఇవాళ ప్రారంభమైంది. ఈ వెరైటీ ఎంటర్ టైనర్ మూవీకి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించనున్నారు. ఇవాళ ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడం పట్ల టీమ్ సంతోషం వ్యక్తం చేసింది.
ఈరోజు ప్రారంభమైన తొలి షెడ్యూల్ షూటింగ్ ఐదు రోజులపాటు హైదరాబాద్ లోనే జరుపుకోనుంది. తర్వాత ఆగస్టులో అమెరికాలో సుదీర్థంగా జరిగే షెడ్యూల్ వుంటుందని యూనిట్ తెలిపింది.
అ ఆ ఫేమ్ నటరాజ్ సుబ్రమణ్యన్ సినిమటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. నితిన్ సరసన మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో రావు రమేష్, నరేష్, ప్రగతి, లిజ్జీ, నర్రా శ్రీను, శ్రీనివాస రెడ్డి, మధు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కధ-త్రివిక్రమ్, సంగీతం-తమన్, డీఓపీ- నటరాజ్ సుబ్రమణ్యం, ఆర్ట్-రాజీవ్ నాయర్, ఎడిటింగ్-ఎస్.ఆర్.శేఖర్. సమర్పణ-నిఖితారెడ్డి, నిర్మాత-సుధాకర్ రెడ్డి, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం-కృష్ణ చైతన్య