బ్రో అప్డేట్... పవన్ కళ్యాణ్ కోసం చిరు హీరోయిన్!

Published : Jun 05, 2023, 08:59 AM IST
బ్రో అప్డేట్... పవన్ కళ్యాణ్ కోసం చిరు హీరోయిన్!

సారాంశం

హీరో పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ బ్రో. సాయి ధరమ్ తేజ్ మరో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ ఐటెం నంబర్ ఉందని తెలుస్తుండగా ఆసక్తికర సమాచారం అందుతుంది.

పవన్ కళ్యాణ్ - సాయి ధరమ్ తేజ్ ల మల్టీస్టారర్ బ్రో. ఈ చిత్ర షూటింగ్ ని పవన్ కళ్యాణ్ వాయువేగంతో పూర్తి చేశారు. ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లిన బ్రో జులై 28న విడుదల కానుంది. అంటే ఆరు నెలల లోపే షూటింగ్ పూర్తి చేసి విడుదల చేస్తున్నారు. గతంలో ఎన్నడూ పవన్ కళ్యాణ్ ఇంత వేగంగా మూవీ చేసింది లేదు. బ్రో తమిళ హిట్ మూవీ వినోదయ సితం రీమేక్. సముద్రఖని దర్శకుడు. త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. 

ఈ మూవీలో ఓ ఐటెం సాంగ్ ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ ఐటెం సాంగ్ షూటింగ్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయట. హైదరాబాద్ లో ఓ పబ్ సెట్ ఏర్పాటు చేశారట. ఆ సెట్లో ఐటమ్ నంబర్ షూట్ చేయనున్నారట. ఆసక్తికర విషయం ఏమిటంటే... ఈ ఐటెం సాంగ్ లో ఊర్వశి రాతెలా నటిస్తున్నారట. పవన్ కళ్యాణ్ తో ఆమె స్టెప్స్ వేయనున్నారట. ఈ మేరకు టాలీవుడ్ లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. 

ఊర్వశి రాతెలా సంక్రాంతి బ్లాక్ బస్టర్ వాల్తేరు వీరయ్య మూవీలో ఐటమ్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. బాస్ పార్టీ సాంగ్ లో ఆమె ఇరగదీశారు. ఊర్వశి నటించిన బాస్ పార్టీ సాంగ్ సినిమాకు ప్లస్ అయ్యింది. అన్నయ్య చిరంజీవితో ఆడిపాడిన ఊర్వశి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో కలిసి డాన్స్ చేయనుంది. 

పవన్ కళ్యాణ్ మరోవైపు ఓ జీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు పూర్తి చేస్తున్నారు. హరి హర వీరమల్లు మాత్రం పక్కన పెట్టేశారు. హరి హర వీరమల్లు నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడో ఇంత వరకు క్లారిటీ లేదు. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ వరుస రిలీజులతో ఫ్యాన్స్ కి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పంచనున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Balakrishna: బాలకృష్ణ కెరీర్‌లో పెద్ద సెన్సేషన్.. అలాంటి రోల్‌లో నటించబోతున్న నందమూరి వారసుడు
Gunde Ninda Gudi Gantalu: చింటూతో రోహిణీ.. రెడ్ హ్యాండెడ్ గా బాలుకి దొరికిపోయిందా..?