
ఈ మధ్య సోషల్ మీడియాలో సామాన్యుల కంటే.. సెలబ్రిటీల రీల్స్ ఎక్కువైపోయాయి. ఏదొ ఒక వీడియో చేస్తూ.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు స్టార్స్. ఏదో పార్ట్ టైమ్ సంసాదనలాగా.. ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టి.. డైలీ తమ యాక్టివిటీస్ ను అందులో ఉంచుతున్నారు. అవి కాస్తా వైరల్ అవుతూ.. లక్షల్లో వ్యూస్.. వేలల్లో లైకులతో పాటు.. డబ్బులు కూడా దండిగా వచ్చిపడుతున్నాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది.. సినిమాల ద్వారా కంటే.. ఇలా సోషల్ మీడియా ద్వారా పాపులారిటిని సంపాదించుకున్నారు. అయితే తాజాగా ఓవీడియో నెట్టింట్లో వైరల్ అవుతుది.
పాపులర్ కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ తో కలిసి..టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల చిందులేసిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంతకీ వారిద్దరు ఎప్పుడు కలిశారు..ఎక్కడ కలిశారు..ఈడాన్స్ సంగతేంటి..? తెలుగులో తనకంటూ పత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల. వరుస సినిమాలతో దూసుకుపోతుంది. తెలుగులో పెళ్లి సందడి సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన ఈ బ్యూటీ తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించుకుంది. తెలుగులో టాప్ హీరోయిన్ జాబితాలో స్థానం దక్కించుకుంది.
తాజాగా నితిన్‌తో జతకట్టింది శ్రీలీల.. ఎక్స్ ట్రా –ఆర్డినరీ మేన్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈమూవీ షూటింగ్‌లో జాయిన్ అయ్యింది. అయితే ఈసినిమాకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫర్ గా ఉన్నారు. ఇక తాజాగా ఈ మూవీ నుంచి డేంజర్ పిల్ల అనె మెలోడి పాటను రిలీజ్ చేశారు. పాటకు మంచి రెస్పాన్స్ రావడంతో కొందరు నెటిజన్లు ఈపాటపై రీల్స్ చేస్తున్నారు. ఈ రీల్స్ వల్ల ఈపాట మరింత పాపులర్ అయ్యింది. ఈ మెలోడీసాంగ్ అందరిని అకట్టుకోవడంతో సెలబ్రిటీలు సైతం ఈ పాట మీద రీల్స్ చేస్తు సందడి చేస్తున్నారు. తాజాగా శేఖర్ మాస్టర్, శ్రీలీల కలిసి డేంజర్ పిల్ల పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు.. ఇద్దరు కలిసి చేసిన ఈ రీల్... నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ సాంగ్ శేఖర్ మాస్టర్, శ్రీలీల చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.. అసలే డాన్స్ లో ఇద్దరికి ఇద్దరు.. అనిపించారు. శేఖర్ మాస్టర్ లాంటి అద్భుతమైన ఎనర్జిటిక్ డాన్సర్ కు పోటీగా శ్రీలీల గ్రేస్ మూమెంట్స్‌తో అందరిని అకట్టుకుంది. శ్రీలీల మాస్టర్‌కు ఏమాత్రం తక్కువ కాకుండా.. తీసిపోకుండా చాలా స్టైల్‌గా చేస్తుంది. ఇక టాలీవుడ్ ఆడియన్స్ ఈ డాన్స్ కు ఫిదా అవుతున్నారు. కొందరైతే శేఖర్ మాస్టర్‌ను డామినేట్ చేశావ్ కదా అంటున్నారు. మరి కొందరు మీరు కూడా కొరియోగ్రాఫర్ అయిపొవచ్చు అంటూ.. కామెంట్స్ పెడుతున్నారు.