వర్షంతో జలమయమైన చెన్నై స్టేడియం.. పర్లేదు సార్ అంటూ ఏఆర్ రెహమాన్‌కు మెస్సేజీలు

Published : Aug 13, 2023, 04:25 AM IST
వర్షంతో జలమయమైన చెన్నై స్టేడియం.. పర్లేదు సార్ అంటూ ఏఆర్ రెహమాన్‌కు మెస్సేజీలు

సారాంశం

ఏఆర్ రెహమాన్ చెన్నైలో శనివారం లైవ్ కాన్సర్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ, వర్షం కారణంగా ఆ కార్యక్రమం రద్దు చేసుకోవాల్సి వచ్చింది. దీనిపై ఏఆర్ రెహమాన్ బాధపడటాన్ని తట్టుకోలేక అభిమానులు, నెటిజన్లు ఆయనకు మద్దతుగా కామెంట్లు చేశారు.  

చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌కు పరవశించిపోని వారు ఎవరు? రికార్డింగ్ పాటలకు, మ్యూజిక్‌కే మనసుపారేసుకుంటే.. ఆయన సంగీతాన్ని లైవ్‌లో వింటే ఇంకా ఎలా ఉంటుందో? అందుకే ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సర్ట్‌లకు అభిమానులు ఎగబడి వెళ్లుతుంటారు. ఏఆర్ రెహమాన్ కూడా అభిమానులను ఏమాత్రం నిరాశపరచరు. కానీ, ఈ సారి అభిమానులను వరణుడు నిరాశపరిచాడు. 

ఏఆర్ రెహమాన్ చెన్నైలో శనివారం కాన్సర్ట్ ఏర్పాటు చేశారు. చాలా మంది శ్రోతలు ఆయన మ్యూజిక్ లైవ్‌లో విని ఎంజాయ్ చేద్దామని కలలు గన్నారు. కానీ, వర్షం కురవడంతో ఈ కాన్సర్ట్ రద్దు చేసుకోవాల్సి వచ్చింది. దీంతో అటు ఏఆర్ రెహమాన్‌కు ఇటు, ఆయన అభిమానులకు నిరాశే కలిగింది.

వర్షానికి ముందు ఏఆర్ రెహమాన్ శ్రోతల్లో హుషారు నింపే ప్రయత్నం చేశారు. ప్రియమైన మిత్రులారా.. మిమ్మల్ని చూడక చాన్నాళ్లవుతున్నది. ఈ రోజు చెన్నైలో నిర్వహించే కాన్సర్ట్‌కు తప్పకుండా హాజరుకండి. స్టేడియంకు ముందుగానే చేరుకుని సీట్లు బుక్ చేసుకోండి అంటూ ఏఆర్ రెహమాన్ పోస్టు చేశారు. చాలా మంది వెళ్లారు కూడా. కానీ, అకాల వర్షంతో ఆశలు ఆవిరయ్యాయి.

వర్షం కారణంగా ఆయన ట్వీట్ చేస్తూ కాన్సర్ట్ రద్దు చేసుకున్నట్టు వివరించారు. తన అభిమానులు, శ్రోతల భద్రతను దృష్టిలో పెట్టుకుని అధికారుల సూచన మేరకు ఈ షో రద్దు చేస్తున్నట్టు తెలిపారు. అయితే, త్వరలోనే మరో తేదీ నిర్ణయిస్తామని పేర్కొన్నారు. అందుకు చాలా మంది శ్రోతలు సుముఖంగానే స్పందించారు. 

అయితే, ఏఆర్ రెహమాన్ కూడా కాన్సర్ట్ గురించి చాలా ఎగ్జయిట్ అయ్యారు. అందుకే ఎప్పటికప్పుడు వర్షానికి సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వర్షంతో ఆ స్టేడియం తడిసిముద్దకావడం, స్టేడియం మునిగిపోయిన చిత్రాలను పోస్టు చేశారు. ఈ రోజు కాన్సర్ట్ అసాధ్యమయ్యేదని, అందరమూ చాలా ఇబ్బందులపాలయ్యేవాళ్లమని రాసుకొచ్చారు. 

Also Read: ‘పుష్ప’ ఫీవర్ తగ్గేదేల్యా.. సింగిల్ పోస్టర్‌తో ఆల్ ఇండియా రికార్డ్, పుష్పా!

ఈ పోస్టులు చూసి ఆయన అభిమానులు కూడా ఒకింత బాధపడ్డారు. తమ అభిమాన సంగీతకారుడు వర్షం కారణంగా కాన్సర్ట్ రద్దు కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని గ్రహించారు. అందుకే రివర్స్‌లో ఏఆర్ రెహమాన్‌కు ఓదార్పు వచనాలు చెబుతున్నారు. పర్లేదు సార్.. మరో కాన్సర్ట్‌లో కలుసుకుందాం అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాన్సర్ట్ వాయిదా పడినా ఫర్వాలేదని, తాము ఎదురుచూస్తామని పేర్కొంటున్నారు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?