
ప్రభాస్ ఈ మధ్య వరుస చిత్రాలు చేస్తున్నారు. బాహుబలి సిరీస్ కి ఐదేళ్లు కేటాయించిన ప్రభాస్ సాహో చిత్రం కొరకు మరో రెండేళ్లు తీసుకున్నారు. ఏడేళ్ల కాలంలో ప్రభాస్ కేవలం మూడు సినిమాలు చేశారు. విరివిగా సినిమాలు చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేయడంతో ఒకటికి నాలుగు ప్రాజెక్ట్స్ ప్రకటించారు. ఇకపై ఏడాదికి ఒకటి రెండు సినిమాలు విడుదలయ్యేలా ప్రయత్నం చేస్తానన్నారు. చెప్పినట్లే ప్రభాస్ నాలుగు ప్రాజెక్ట్స్ పైగా ప్రకటించారు. గత ఏడాది రాధే శ్యామ్ విడుదల చేశారు. ఇటీవల ఆదిపురుష్ తో ప్రేక్షకులను పలకరించారు.
ప్రస్తుతం సలార్ రెడీగా ఉంది. సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. టీజర్ విడుదల కాగా.. ఆకట్టుకుంది. సలార్ షూటింగ్ దాదాపు పూర్తి చేశాడు ప్రభాస్. డబ్బింగ్ చెప్పాల్సి ఉందని సమాచారం. అలాగే నాగ్ అశ్విన్ తో చేస్తున్న కల్కి షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ ఏడాది చివరికల్లా కల్కి చిత్రీకరణ పూర్తయ్యే అవకాశం కలదు. చెప్పినట్లు సంక్రాంతికి విడుదల కావడం కష్టమే అంటున్నారు.
అయితే కల్కి షూటింగ్ పూర్తి కాగానే ప్రభాస్ లాంగ్ బ్రేక్ తీసుకుంటారనే ప్రచారం జరుగుతుంది. ఆయన అమెరికా వెళ్లనున్నారట. ఇందుకు అనారోగ్య సమస్యలే కారణం అంటున్నారు. కొన్నాళ్లుగా కుడి మోకాలి నొప్పితో బాధపడుతున్నారట. డాక్టర్స్ సర్జరీ సూచించిన నేపథ్యంలో అమెరికాలో చికిత్స తీసుకోనున్నారట. సర్జరీ జరిగాక కొన్నాళ్ళు కదిలే పరిస్థితి ఉండదు. అందుకే ప్రభాస్ గాయం తగ్గే వరకు ఎలాంటి షూటింగ్స్ చేయరట. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది.
ఇక సలార్, కల్కి చిత్రాలతో పాటు రాజా డీలక్స్ టైటిల్ తో ప్రభాస్ ఒక మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి మారుతి దర్శకుడు. ఆల్రెడీ ఈ మూవీ కొంత షూటింగ్ జరుపుకుంది. అలాగే అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ టైటిల్ తో ఒక మూవీ ప్రకటించారు. సలార్ 2 కూడా ఉందని విశ్వసనీయ సమాచారం.