అక్కినేని హీరో ఋణం అలా తీర్చుకున్న సమంత..!

Published : Apr 08, 2023, 11:51 AM ISTUpdated : Apr 08, 2023, 12:02 PM IST
అక్కినేని హీరో ఋణం అలా తీర్చుకున్న సమంత..!

సారాంశం

నాగ చైతన్య అంటే మండిపడుతున్న సమంత ఆ కుటుంబంలోని మిగతా సభ్యులతో సన్నిహిత సంబంధాలు మైంటైన్ చేస్తున్నారు. ఇది ఆసక్తికర పరిణామం.   

నాగ చైతన్యకు సమంత దూరమై చాలా కాలం అవుతుంది. విడాకుల అనంతరం సమంత నాగ చైతన్య మీద ఆరోపణలు గుప్పించింది. పరోక్షంగా తన తప్పేమీ లేదు అంతా చైతూ వలనే అని చెప్పే ప్రయత్నం చేసింది. చైతూపై కోపంగా ఉన్న సమంత ఆయన కుటుంబ సభ్యులతో పరిచయాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా రానా, అఖిల్ కి ఆమె చాలా క్లోజ్ గా ఉంటున్నారు. నేడు అఖిల్ బర్త్ డే కాగా సమంత బెస్ట్ విషెస్ తెలియజేసింది. అఖిల్ లేటెస్ట్ మూవీ ఏజెంట్ పోస్టర్ షేర్ చేస్తూ... పనిలో పనిగా ఆయన సినిమాకు కూడా పబ్లిసిటీ కల్పించింది.

సమంత బర్త్ డే నాడు అఖిల్  ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశాడు. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకొని మరీ సమంత తిరిగి అఖిల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. ఆ విధంగా ఆయన ఋణం తీర్చేసుకుంది. ఈ క్రమంతో నాగ చైతన్యతో విబేధాలు అఖిల్ తో తన రిలేషన్ ని దెబ్బ తీయలేదన్న విషయం రుజువైంది. 

వదినగా అప్పట్లో అఖిల్ పెళ్లి చేయడానికి సమంత చాలా ప్రయత్నం చేశారనే టాక్ ఉంది. అలాగే రానా -మిహికా బజాజ్ పెళ్ళిలో సమంత అన్నీ తానై వ్యవహరించారు. సమంత-చైతు గొడవలు వారి వ్యక్తిగతమని నమ్ముతున్న అక్కినేని కుటుంబ సభ్యులు సమంతతో సాన్నిహిత్యం కొనసాగిస్తున్నారు. సమంత చాలా మంచి అమ్మాయని, ఆమె ప్రవర్తన కుటుంబ సభ్యులకు నచ్చిందని దీంతో రుజువైంది. గతంలో నాగార్జున ఇదే అభిప్రాయం వెల్లడించారు. సమంత గుడ్ గర్ల్. చైతూతో విడాకులు కావడం దురదృష్టమని అన్నారు. 

అఖిల్ కి బర్త్ డే విషెస్ చెప్పిన సమంత ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది. అప్పట్లో సమంతను టార్గెట్ చేసిన అక్కినేని ఫ్యాన్స్ దీన్ని గమనించాలి. ప్రస్తుతం సమంత శాకుంతలం ప్రమోషన్స్ లో బిజీగా ఉనాన్రు. ఏప్రిల్ 14న శాకుంతలం వరల్డ్ వైడ్ విడుదల కానుంది. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. అలాగే సిటాడెల్, ఖుషి చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా