కార్చిచ్చులో కూడా వికసించే పువ్వు నువ్వు... ఆయన పంపిన సందేశం అపురూపంగా దాచుకున్న సమంత!

Published : Mar 09, 2023, 03:59 PM ISTUpdated : Mar 09, 2023, 04:10 PM IST
కార్చిచ్చులో కూడా వికసించే పువ్వు నువ్వు... ఆయన పంపిన సందేశం అపురూపంగా దాచుకున్న సమంత!

సారాంశం

సమంత ఇంస్టాగ్రామ్ పోస్ట్ నెటిజెన్స్ ని ఆకర్షించింది. ఓ వ్యక్తి పంపిన సందేశాన్ని సమంత అపురూపంగా దాచుకున్నట్లు తెలుస్తుంది.

హీరోయిన్ సమంత సర్కిల్ మారిపోయింది. ఆమెకు బాలీవుడ్ ప్రముఖులతో పరిచయాలు పెరిగాయి. ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ అనంతరం హిందీ చిత్ర పరిశ్రమలో ఆమె పాపులర్ అయ్యారు. ఎక్కువ సమయం అక్కడే గడుపుతున్నారు. ముంబైలో సమంత ఖరీదైన ఇల్లు కొన్నట్లు సమాచారం. ఏకంగా హైదరాబాద్ నుండి మకాం ముంబైకి మార్చేస్తుందంటూ వార్తలు వచ్చాయి. మయోసైటిస్ నుండి కోలుకున్న సమంత సిటాడెల్ షూట్లో పాల్గొంటున్నారు. వరుణ్ ధావన్ మరో ప్రధాన పాత్ర చేస్తుండగా ది ఫ్యామిలీ మాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. 

సిటాడెల్ ఫస్ట్ షెడ్యూల్ ముంబైలో జరిగింది. అనంతరం నార్త్ ఇండియాలో చిత్రీకరణ జరిపారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని నైనిటాల్ లో సిటాడెల్ కి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. నెక్స్ట్ షెడ్యూల్ విదేశాల్లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సౌత్ ఆఫ్రికాతో పాటు పలు దేశాల్లో సిటాడెల్ షూట్ జరపనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. 

ఇదిలా ఉంటే సమంత లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ నెటిజెన్స్ ని ఆకర్షించింది. 'కార్చిచ్చు దహించినా వికసించే పుష్పానివి నువ్వు, గుర్తు పెట్టుకో' అని ఒక వైట్ స్లిప్ పై రాసి ఉన్న సందేశం ఆమె ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఆ మెసేజ్ సమంతకు ఎవరు పంపారంటే... రోహిత్ భత్కర్. సమంత రోహిత్ సందేశాన్నిఅపురూపంగా దాచుకున్నారు. ఇంతకీ ఎవరీ రోహిత్ అంటే... ఈయన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్, హెయిర్ డ్రెస్సర్. సమంతతో కొన్ని ప్రాజెక్ట్స్ కి కలిసి పనిచేశాడు. 

ఈ క్రమంలో రోహిత్ భత్కర్ లో సమంతకు మంచి సాన్నిహిత్యం ఉంది సమంత స్వభావాన్ని తెలియజేస్తూ ఒక స్ఫూర్తిదాయక సందేహం ఆమెకు పంపాడు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా చలించని స్ట్రాంగ్ ఉమెన్ నీవని పరోక్షంగా చెప్పాడు. ఉమెన్స్ డే రోజు సమంతకు రోహిత్ ఆ సందేశం పంపాడు. సమంత దాన్ని ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది. 

సమంత ఈ మధ్య కాలంలో వ్యక్తిగతంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. నాగ చైతన్యతో విడాకులు, ఆపై విమర్శలు, అనారోగ్య సమస్యలు ఆమెను కృంగదీశాయి. వాటన్నింటినీ సమంత ఎదిరించి నిలిచారు. సాధారణ స్థితికి చేరుకున్నారు. ఆమె నటించిన పౌరాణిక చిత్రం శాకుంతలం విడుదలకు సిద్ధమవుతుంది. విజయ్ దేవరకొండ కు జంటగా నటిస్తున్న ఖుషి త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్