నూతన గృహప్రవేశం చేసిన బిగ్ బాస్ హిమజ 

Published : Jun 11, 2023, 08:59 AM IST
నూతన గృహప్రవేశం చేసిన బిగ్ బాస్ హిమజ 

సారాంశం

నటి హిమజ నూతన గృహప్రవేశం చేశారు. తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. హిమజ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.   


బిగ్ బాస్ ఫేమ్ హిమజ కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ లో గేటెడ్ కమ్యూనిటీలో నూతన గృహ నిర్మాణం చేపట్టారు. కొన్ని నెలలుగా ఆ ఇంటి నిర్మాణం జరుగుతుంది. ఇటీవల నిర్మాణం పూర్తి కాగా హిమజ గృహప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నారు. ముహూర్తం మేరకు నేడు ఉదయం హిమజ కొత్త ఇంట్లో అడుగు పెట్టారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. లక్ష్మీదేవి పటం పట్టుకొని ఉన్న హిమజ చిరు నవ్వులు పూయించారు. పట్టువస్త్రాలు నిండుగా తయారయ్యారు. 

ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులకు తెలియజేశారు. కొత్త ఇల్లు నిర్మించుకోవడం అంటే మన కలలు నెరవేర్చుకోవడం, జ్ఞాపకాలను పదిల పరుచుకోవడం. నాకు నేనే శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను, అని కామెంట్ చేశారు. హిమజ నూతన గృహప్రవేశం చేసిన నేపథ్యంలో అభిమానులు, మితృలు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. ఆధునిక హంగులతో అత్యంత విలాసవంతంగా హిమజ ఇంటిని నిర్మించుకున్నట్లు సమాచారం. దాని విలువ కోట్లలో ఉంటుందని వినికిడి. 

కాగా సీరియల్ నటిగా హిమజ కెరీర్ మొదలైంది. అనేక చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశారు. నేను శైలజ, జనతా గ్యారేజ్, స్పైడర్, శతమానం భవతి, వినయ విధేయ రామ వంటి చిత్రాలు ఆమెకు ఫేమ్ తెచ్చిపెట్టాయి. బిగ్ బాస్ సీజన్ 3లో హిమజ పాల్గొన్నారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొన్ని వారాలు హౌస్లో ఉన్నారు. ఈ మధ్య బుల్లితెర మీద ఆమె పెద్దగా కనిపించడం లేదు. అడపాదడపా చిత్రాలు చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?