వెంకీకి హీరోయిన్ దొరికింది..

Published : Nov 11, 2017, 07:00 PM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
వెంకీకి హీరోయిన్ దొరికింది..

సారాంశం

విక్టరీ వెంకటేష్, తేజ కాంబినేషన్ లో మూవీ గతంలో ఈ మూవీ హిరోయిన్ గా కాజల్ ను అనుకున్న టీమ్ కొత్తగా ఈ మూవీలో కాజల్ స్థానంలో నిత్యా మీనన్ ను ఎంపిక చేసిన టీమ్

విక్టరీ వెంకటేష్ హీరోగా తేజ కాంబినేషన్ లో.. రాబోతున్న సినిమాకు హీరోయిన్ గా... గతంలో కాజల్ ను అనుకున్న సంగతి తెలిసిందే. అయితే కాజల్ డేట్స్ కుదరకపోవడడంతో ఆమె స్థానంలో ఫైనల్ గా మరో హీరోయిన్ దొరికిందట.

 

ఈ సినిమాలో నేనే రాజు నేనే మంత్రి బ్యూటీ కాజల్ అగర్వాల్ వెంకీ సరసన హీరోయిన్‌గా తీసుకున్నట్టు ఓ ప్రచారం జరిగింది. కానీ ఇతరత్రా కారణాలతో కాజల్ పక్కకు తప్పుకోవడంతో ఇప్పుడామె స్థానంలో కేరళ కుట్టి నిత్యామీనన్‌ని ఓకే చేసుకున్నట్టు వార్తలొస్తున్నాయి. కాకపోతే ఇందులో ఎంతమేరకు నిజం వుందనే విషయం దీనిపై ఓ అధికారిక ప్రకటన వెలువడితే కానీ తెలిసే ఛాన్స్ లేదు.

 

సురేష్ ప్రొడక్షన్స్, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ సినిమాను వచ్చే ఏడాదికి రిలీజ్ చేసి అదే ఏప్రిల్ నెలలో ఎన్టీఆర్ బయోపిక్ సినిమాను ప్రారంభిస్తాను అని ఆల్రెడీ ప్రకటించేశాడు డైరెక్టర్ తేజ.

PREV
click me!

Recommended Stories

Om Shanti Shanti Shantihi Trailer Review: తరుణ్‌ భాస్కర్‌ కి వణుకు పుట్టించిన ఈషా రెబ్బా, ట్రైలర్‌ ఎలా ఉందంటే?
Sobhita Dhulipala: శోభితకు ఇష్టమైన సినిమా అదే, ఆమె భర్త చైతూది మాత్రం కాదు