పవన్ తో విడాకుల గురించిన వివరాలపై రేణుదేశాయి స్పందన

Published : Nov 11, 2017, 04:42 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
పవన్ తో విడాకుల గురించిన వివరాలపై రేణుదేశాయి స్పందన

సారాంశం

బద్రి సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించిన రేణుదేశాయి పవన్ తో ప్రేమ వివాహం చేసుకున్న రేణు దేశాయి విడాకులకు కారణాలను ఆటో బయోగ్రఫీలో వెల్లడిస్తానన్న రేణు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘బద్రి’ సినిమాలో తన సరసన నటించిన హిరోయిన్ రేణు దేశాయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు అఖిరానంద్, ఆద్య.  కొంత కాలం తర్వాత వీరిద్దరి మద్య అభిప్రాయ భేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు.  కానీ, వీరిద్దరి మధ్య ఇప్పటికే స్నేహబంధం కొనసాగుతూనే ఉంది.

 

తన పిల్లల కోసం రేణు దేశాయ్ ఇంటికి వెళ్లి టైమ్ స్పెండ్ చేస్తుంటారు పవన్ కళ్యాన్.  ఒక టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ, తాను విడాకులు తీసుకుని ఏడేళ్లు పూర్తైందని, ఇప్పుడు దాని గురించి మాట్లాడడం సరికాదని అన్నారు. మోడల్ గా కెరీర్ ఆరంభించిన మొదట్లో తనపై తనకు నమ్మకం వుండేది కాదని అన్నారు. అంతేకాదు, అబ్బాయిలెవరూ తనను చూడటం లేదట.

 

దాంతో 'బద్రి' సినిమా షూటింగ్ సమయంలో పవన్ కల్యాణ్ ను చూడగానే పడిపోయానని ఆమె అన్నారు. దానినే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారని ఆమె చెప్పారు. తమది సంప్రదాయ కుటుంబమైనా అంతా ఆయనే చూసుకుంటారని భావించి, తాను సహజీవనానికి అంగీకరించానని తెలిపారు.

 

విడాకులు ఎందుకు తీసుకున్నానో ఇప్పుడు చెప్పనని, వృద్దాప్యంలో ఆటోబయోగ్రఫీలో రాస్తానని ఆమె చెప్పారు. తామిద్దరం ఇప్పటికీ మంచి స్నేహితుల్లా ఉంటామని ఆమె అన్నారు. ఈ ఎపిసోడ్ ఆదివారం టెలీకాస్ట్ కానుంది.

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu: మనోజ్ కి నడిచొచ్చే కొడుకు.. రోహిణీ గతం బయటపడుతుందా? బాలుకి అబద్ధం చెప్పిన మీనా
Bigg Boss Telugu Winners : టైటిల్ గెలిచారు కానీ.. ఉపయోగం లేదు, బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?