ప్రముఖ సింగర్ రాధిక కన్నుమూత

Published : Nov 11, 2017, 05:04 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
ప్రముఖ సింగర్ రాధిక కన్నుమూత

సారాంశం

ప్రముఖ సింగర్ రాధిక కన్నుమూత గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాధిక సూపర్ హిట్ సాంగ్స్ పాడిన రాధిక మృతికి సంతాపం తెలిపిన సినీప్రముఖులు

ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ రాధిక మృతి చెందారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.

 

రాధిక కిడ్నీ ఫెయిలవడంతో గత కొంత కాలంగా డయాలసిస్ తీసుకుంటున్న ఆమెని కుటుంబసభ్యులు యధావిధిగా డయాలసిస్ నిమిత్తం నిన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. డయాలసిస్ జరుగుతున్న క్రమంలోనే హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆమె ఆస్పత్రిలోనే కన్నుమూశారు.

 

తెలుగునాట రాధిక గొంతుకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. 'ఆట కావాలా ?', 'బావలు సయ్యా..' 'అమలాపురం బుల్లోడా..' 'సున్నుండ తీస్కో' లాంటి పాటలతో ఆమె సంగీత ప్రియులని ఆకట్టుకున్నారు. రాధిక మృతి వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆమె మృతిపట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు.

PREV
click me!

Recommended Stories

దళపతి విజయ్ కి కోర్టులో ఎదురుదెబ్బ... జన నాయగన్‌కు సెన్సార్ కష్టాలు, నెక్స్ట్ ఏంటి?
Chiraneevi: తన విలన్ ప్రాణాలు కాపాడడానికి 60 లక్షల రూపాయలు ఖర్చుపెట్టిన చిరంజీవి