ఛాన్సులు వస్తున్నాయి, నటనకు గుడ్ బై అనేసిన చార్మి.. కారణం ఏంటి ?

pratap reddy   | Asianet News
Published : Oct 24, 2021, 08:52 PM IST
ఛాన్సులు వస్తున్నాయి, నటనకు గుడ్ బై అనేసిన చార్మి.. కారణం ఏంటి ?

సారాంశం

టాలీవుడ్ ఓ చార్మి గ్లామర్ మెరుపులు మెరిపించి నటి. తన అందాలతో కుర్రకారుని ఒకప్పుడు ఉర్రూతలూగించింది. చార్మి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది.

టాలీవుడ్ ఓ చార్మి గ్లామర్ మెరుపులు మెరిపించి నటి. తన అందాలతో కుర్రకారుని ఒకప్పుడు ఉర్రూతలూగించింది. చార్మి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. కానీ ఇటీవల కొంత కాలంగా చార్మి వెండి తెరకు దూరమైంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కు దగ్గరైన చార్మి నిర్మాతగా మారి సినిమాలు చేస్తోంది. 

ప్రస్తుతం Charmy Kaur వయసు కేవలం 34 ఏళ్ళు మాత్రమే. ఆమెకన్నా వయసు పైబడిన హీరోయిన్లు ఇంకా నటిస్తున్నారు. హీరోయిన్ గా అవకాశాలు లేకున్నా ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. కానీ చార్మి మాత్రం పూర్తిగా నటనకు స్వస్తి చెప్పేసింది. దీనిపై చార్మి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. 

తాను ఇక నటించే అవకాశమే లేదని అభిమానులని నిరాశలో ముంచెత్తింది. ఓ ఇంటర్వ్యూలో చార్మి ఈ వ్యాఖ్యలు చేసింది. హీరోయిన్ గా ఉంటేనే ఎక్కువ కంఫర్టబుల్ గా ఉంటుంది. హీరోయిన్ గా ఉన్నప్పుడు కేవలం ఫిట్ నెస్ చూసుకుంటే చాలు. కానీ నిర్మాతగా ఉన్నప్పుడు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. అందరి సౌకర్యాలు చూసుకోవాలి. అయితే నిర్మాతగా మారినందుకు నాకు ఎలాంటి ఇబ్బంది, విసుగు లేవు. 

నటిగా నాకు ఇంకా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. కానీ ఇక నటించే అవకాశం లేదు అని చార్మి షాకిచ్చింది. చార్మి చివరగా మంత్ర2 లో నటించింది. అంతకు ముందు పూరి దర్శకత్వంలో జ్యోతిలక్ష్మి చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ప్రస్తుతం పూరి తెరకెక్కిస్తున్న విజయ్ దేవరకొండ 'లైగర్' చిత్రానికి నిర్మాణ బాధ్యతలు చూసుకుంటోంది.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌