Latest Videos

పండంటి బిడ్డతో ఇంట్లో అడుగుపెట్టిన అమలాపాల్.. సంతోషంలో ఏం చేసిందంటే..?

By Mahesh JujjuriFirst Published Jun 18, 2024, 12:51 PM IST
Highlights

పట్టరాని సంతోషంలో ఉంది హీరోయిన్ అమలా పాల్.. బిడ్డకు జన్మనివ్వడంతో.. తన ఆనందానికి అవధుల్లేకుండాపోయింది. తాజాగా తన బేబీ బాయ్ కి గ్రాండ్ వెల్కం కూడా చెప్పింది హీరోయిన్. 

హీరోయిన్ అమలా పాల్ సంతోషంలో తేలియాడుతోంది.. ఆమెకు రీసెంట్ గా  పండంటి మగబిడ్డ పుట్టడంతో మురిసిపోతోంది బ్యూటీ. అమలా పాల్  జూన్ 11న మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు చెబుతూ సోషల్ మీడియా లో బ్యూటీఫుల్ వీడియో పోస్ట్ చేశారు. హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన అమలా పాల్.. ఆమె భర్త  జగత్ దేశాయ్..  తమ వారసునికి గ్రాండ్ గా వెల్కం చెప్పారు. ఇళ్ళంతా అలంకరించి వారు చేసిన హడావిడి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

పండంటి బిడ్డకు జన్మనిశ్చిన అమలా పాల్ కు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు  దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. లాస్ట్ ఇయర్ అమలా పాల్ జగత్ దేశాయ్ ను పెళ్ళాడింది. జగన్ గుజరాత్ కు చెందిన వ్యక్తి కాగా.. అతన్ని ప్రేమించి  పెళ్లిపీటలెక్కింది అమలా పాల్.  అయితే ఆమెకు ఇది రెండో పెళ్లి కాగా.. మొదటి భర్తతో వివాదాల కారణంగా విడాకులు తీసుకుంది. కొన్నినెలల క్రితం తమ జీవితంలో మరో కొత్త వ్యక్తి రాబోతున్నారంటూ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది. అప్పటి నుంచి తన బేబీ బంప్ ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోందీ ముద్దుగుమ్మ. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jagat Desai (@j_desaii)

అంతే కాదు ఆమె ప్రెగ్నంట్ తో ఉండగా.. సీమంతం వేడుకలను కూడా చాలా ఘనంగా చేసుకుంది అమలా పాల్. తన ప్రగ్నెన్సీలో ప్రతీ మూమెంట్ ను చాలా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ వచ్చింది. అలాగే సీమంతం వేడుకలతో పాటు.. బేబీ బంప్ తో ఫోటోషూట్లు చేస్తూ.. వాటిని తన పేజ్ లో శేర్ చేసింది అమలా పాల్. తాజాగా బిడ్డకు జన్మనిచ్చి అమ్మవడంతో అమలా పాల్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

సినిమాల్లోకి రోజా రీ ఎంట్రీ..? జబర్థస్త్ కూడా కష్టమే.. కోలీవుడ్ కు వెళ్ళిపోయిందా..?

ఇక ఈ సందర్భంగా అమలా పాల్ మరో సర్ ప్రైజ్ కూడా ఇచ్చింది. తమ కుమారుడి పేరును కూడా అమలాపాల్ వెల్లడిండించి. కుమారుడికి ఇలాయ్ (ILAI) అని పేరు పెట్టినట్టు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది. ఇక ఆమె తన పోస్ట్ లో ఇలా రాసుకొచ్చింది. మా చిన్ని అద్భుతాన్ని చూసేయండి. 11.06.2024న జన్మించాడు’ అని వీడియో పోస్ట్ లో రాసుకొచ్చింది. ఇక అమ్మయిన ఆనందంలో తన కుమారుడిని చేతుల్లో ఎత్తుకొని ఇంట్లోకి సంతోషంగా అడుగుపెట్టింది అమలా పాల్. ఇక అమలా పాల్ సినిమాల విషయానికి వస్తే.. ఆమె చివరిగా పృథ్వీరాజ్ సుకుమారన్  నటించిన ఆడు జీవితం సినిమాలో కనిపించింది. ఇక ముందు ముందు ఆమె నటనను కొనసాగిస్తానంటూ వెల్లడించింది. 

రజినీకాంత్ కు అవమానం.. అర్జున్ కూతురి పెళ్ళిలో ఇలా జరిగిందేంటి..? మండిపడుతున్న ఫ్యాన్స్..
 

click me!