Latest Videos

`పుష్ప 2` కొత్త రిలీజ్‌ డేట్‌.. ఆ మ్యాజిక్‌ రిపీట్‌ అవుతుందా?.. బన్నీ మోస్ట్ వాయిలెంట్‌ లుక్‌ చూశారా?

By Aithagoni RajuFirst Published Jun 17, 2024, 8:46 PM IST
Highlights

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం `పుష్ప 2`లో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి వాయిదా పడింది. కొత్త డేట్‌ ఇచ్చింది టీమ్‌. 
 

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తోన్న నాల్గో మూవీ `పుష్ప 2`. ఇప్పటికే `ఆర్య`, `ఆర్య 2`, `పుష్ప` చిత్రాలు వచ్చాయి. `ఆర్య 2` ఆడలేదు. కానీ `పుష్ప` మాత్రం సంచలన విజయం సాధించింది. దీనికి పార్ట్ 2 రాబోతుంది. `పుష్ప 2`ని గత మూడేళ్లుగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సుకుమార్‌. మొదటి పార్ట్ పెద్ద హిట్‌ కావడంతో పార్ట్ 2పై అందరిలోనూ అంచనాలున్నాయి. నార్త్ లోనూ ఈ మూవీకి విశేష స్పందన రావడంతో రెండో భాగాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సుకుమార్. బడ్జెట్‌ పెరిగింది. సినిమా కథ స్కేల్‌ పెరిగింది. గ్రాండియర్‌ నెస్‌ని పెంచారు. 

ఇండియన్‌ ఆడియెన్స్ ని మాత్రమే కాదు, గ్లోబల్‌ ఆడియెన్స్ ని ఆకట్టుకునేలా తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఆ దిశగా దర్శకుడు సుకుమార్‌ కసరత్తులు చేస్తున్నారు. కథ విషయంలో, సీన్ల విషయంలో సుకుమార్‌ రాజీపడరు. బాగా చక్కడంలో రాజమౌళి తర్వాత సుకుమార్‌ నిలుస్తారు. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్‌ బాగా లేట్‌ అవుతుంది. దీనికితోడు సెట్‌లోనే కథలో మార్పులు జరుగుతుంటాయట, సీన్స్ ఇంప్రూవ్‌మెంట్‌ జరుగుతుందట. ఇవన్నీ షూటింగ్‌ డిలేకి కారణమవుతున్నాయని చెప్పొచ్చు. 

ఇక ఆగస్ట్ 15న రావాలని చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఎన్ని రూమర్లు వచ్చినా ఆ డేట్‌ కన్ఫమ్‌ అని చెబుతూ వచ్చాయి. కానీ ఇటీవల రామ్‌ నటించిన `డబుల్‌ ఇస్మార్ట్` మూవీ రిలీజ్‌ డేట్‌నిప్రకటించింది. ఆగస్ట్ 15న రాబోతున్నట్టు వెల్లడించడంతో `పుష్ప 2`పై అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఈ సినిమా వాయిదా పడుతుందనే రూమర్స్ ఊపందుకున్నాయి. సినిమా షూటింగ్‌కి ఇంకా రెండు నెలలు పడుతుందని, పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ కి ఇంకా టైమ్‌ పడుతుందని, ఎట్టిపరిస్థితుల్లోనూ సినిమా రావడం కష్టమనే ప్రచారం జరిగింది. సినిమా వాయిదా పడుతుందని, డిసెంబర్‌కి వెళ్తుందని అన్నారు. 

in cinemas from December 6th, 2024. pic.twitter.com/BySX31G1tl

— Allu Arjun (@alluarjun)

అన్నట్టే జరిగింది. డిసెంబర్‌లోనే రాబోతుంది. తాజాగా టీమ్‌ కొత్త రిలీజ్‌ డేట్‌ని ఇచ్చింది. డిసెంబర్‌ 6న విడుదల చేయబోతున్నట్టు వెల్లడించింది. రూమర్స్ పరంగా క్రిస్మస్‌ అనే టాక్‌ వచ్చింది. కానీ అంతకంటే ముందే సినిమా రాబోతుండటం విశేషం. `పుష్ప` కూడా డిసెంబర్‌లోనే వచ్చింది. 2021 డిసెంబర్‌ 17న విడుదలైంది. పెద్ద హిట్‌ అయ్యింది. ఇప్పుడు ఆల్మోస్ట్ అదే నెలలో సినిమా రాబోతుంది. ఈ లెక్కన అదే మ్యాజిక్‌ రిపీట్‌ అవుతుందా అనేది చూడాలి. ఇక ఇందులో బన్నీకి జోడీగా రష్మిక మందన్నా నటిస్తున్న విషయం తెలిసిందే.  సినిమాని మరోసారి వాయిదా వేసిన నేపథ్యంలో టీమ్‌ వివరణ ఇచ్చింది. ఎందుకు వాయిదా వేయాల్సిందో తెలిపింది. ఆగస్ట్ 15 వరకు షూటింగ్‌ కంప్లీట్‌ కావడం లేదు, బెస్ట్ ఔట్‌ పుట్‌ కోసం, క్వాలిటీ కోసం వాయిదా వేయాల్సి వస్తుంది, వెయిట్‌ చేసినా ది బెస్ట్ ఇవ్వబోతున్నామని తెలిపింది టీమ్‌. అభిమానులు, నిర్మాణ, బిజినెస్‌ పార్టనర్స్ అర్థం చేసుకుంటారని తెలిపింది టీమ్‌.
 

pic.twitter.com/nJriHfv90N

— Mythri Movie Makers (@MythriOfficial)
click me!