Latest Videos

షాకింగ్: దర్శన్ ని వెనకేసుకొస్తూ మాట్లాడిన నటి కస్తూరి,తప్పు రేణుకాస్వామిదే అని తేల్చింది

By Surya PrakashFirst Published Jun 18, 2024, 10:46 AM IST
Highlights

చనిపోయిన వ్యక్తి కూడా మంచివాడు కాదు. తను పవిత్రను వేధించాడు. అసలు తనకు ఏంటి సంబంధం. ఎందుకు అసలు అలాంటి మెసేజ్‌లు పెట్టాలి.


 కన్నడ నటుడు దర్శన్ హత్య కేసులో అరెస్ట్ అవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్‌ పాత్ర పై పక్కా ఆధారాలు సేకరించారు బెంగళూరు పోలీసులు. ప్రియురాలు  పవిత్ర గౌడకు అసభ్య మెసేజ్‌లు పంపాడనే కోపంతో తన అభిమాని రేణుకా స్వామిని దర్శన్‌ కిడ్నాప్‌ చేయించినట్టు తేలింది. రేణుకాస్వామి మర్డర్‌కు ముందు దర్శన్ పవిత్రతో కలిసి షెడ్డుకు వెళ్లిన సీసీ ఫూటేజీ కూడా  దొరికింది. ఈ క్రమంలో  తానే స్వయంగా తన ఫ్యాన్స్‌ను ఉపయోగించుకుని రేణుకా స్వామి అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితుడిగా పోలీసుల అదుపులో ఉన్నాడు. దాంతో చాలా మంది సెలబ్రెటీలు దర్శన్ చేసింది తప్పని, శిక్ష పడాల్సిందే అంటూ మీడియాతో మాట్లాడుతున్నారు. అయితే తాజాగా నటి కస్తూరి మాత్రం షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. 

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి కస్తూరి మాట్లాడుతూ... ‘‘ దర్శన్ జీవితంలో ప్రాబ్లమ్స్ ఉంటే.. అతని భార్య చూసుకుంటుంది. కానీ పోలీసులు, కోర్టు అంటూ చాలా ఉన్నాయి. అదంతా అతని పర్సనల్ లైఫ్. కానీ కొందరు సెలబ్రిటీకి మేసేజ్‌లు చేసి వేధించే హక్కు పబ్లిక్‌కు లేదు. దర్శన్ విషయంలో అది చాలా దూరం వెళ్ళింది.  దర్శన్, రేణుకా స్వామిని కొట్టి బుద్ధి చెప్పాలనుకున్నాడేమో కానీ పరిస్థితి చేజారి చనిపోయాడు. 

హింసను ఎప్పుడూ ప్రోత్సహించకూడదు. కానీ చనిపోయిన వ్యక్తి కూడా మంచివాడు కాదు. తను పవిత్రను వేధించాడు. అసలు తనకు ఏంటి సంబంధం. ఎందుకు అసలు అలాంటి మెసేజ్‌లు పెట్టాలి. పవిత్రతో దర్శన్ రిలేషన్‌షిప్‌లో ఉండటం తప్పే. కానీ సోషల్ మీడియాలో ఇప్పటికే దాని గురించి పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక బిజినెస్ మ్యాన్, పొలిటీషన్ ఇలా చేస్తే అతను ఎవరో కూడా తెలియకుండా మాయం చేస్తారు. అదే ఇండస్ట్రీకి చెందిన వారు చేస్తే మాత్రం ఇబ్బంది పెడతారు ఇదేం న్యాయం.

అలా అని మనుషులను కొట్టాలి, చంపాలి అనడం లేదు. కానీ ఎవరికైనా ఏదో ఒక పాయింట్‌లో సహనం పోతుంది. అయితే ప్రస్తుతం ఎవరి ఇంట్లో అయినా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అలాగే పర్సనల్ లైఫ్‌లో ఒక వ్యక్తి రిలేషన్‌షిప్‌లో ఉండడం అనేది తప్పే కాదు. తప్పు అనే హక్కు కూడా ఎవరికీ లేదు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కస్తూరి శంకర్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. చాలా మంది కస్తూరిని ఇలా మాట్లాడటం పద్దతి కాదంటున్నారు. 
 

click me!