
ఎప్పటికప్పుడు క్రేజీ ఆఫర్స్ పట్టేస్తూ ఎవర్ గ్రీన్ హీరోయిన్ అనిపించుకుంటుంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఏకంగా చిరంజీవితో ప్రాజెక్ట్ ప్రకటించి, తన స్టార్డం ఏమిటో నిరూపించుకుంది.
తమన్నా (Tamannah) పరిశ్రమకు పరిచయమై దశాబ్దంన్నర కాలం దాటిపోయింది. స్టార్ హీరోయిన్ గా హైట్స్ చూసిన తమన్నా, సీనియర్స్, జూనియర్స్ అనే తేడా లేకుండా అందరు టాప్ స్టార్స్ తో నటించారు. ఒకప్పుడు ప్రభాస్, ఎన్టీఆర్, పవన్, మహేష్ వంటి స్టార్స్ ఛాయిస్ గా ఉన్న తమన్నా ప్రస్తుతం సీనియర్ స్టార్స్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ల ఛాయిస్ గా మారారు. ఈ ముగ్గురు సీనియర్ హీరోలతో తమన్నా ఇప్పటికే నటించారు.
కాగా వెంకీతో ఎఫ్ 3 చిత్రం ద్వారా మరోసారి జతకట్ట నుండి. ఎఫ్ 3 షూటింగ్ చివరి దశకు చేరుకోగా, ఫిబ్రవరి 25న విడుదల కానుంది.
కాగా చిరంజీవితో కూడా సెకండ్ ప్రాజెక్ట్ ప్రకటించింది తమన్నా. చిరంజీవి (Chiranjeevi) లేటెస్ట్ మూవీ భోళా శంకర్ లో తమన్నా నటిస్తున్నారంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై స్పందించిన తమన్నా, తనకు ఎటువంటి అడ్వాన్స్ అందలేదని చెప్పింది.
కాగా నేడు దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది. భోళా శంకర్ చిత్రంలో తమన్నా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ పోస్టర్ విడుదల చేశారు.
Also read Anasuya: తమన్నా కన్నా అనసూయ దారుణం, నిర్వాహకులకు తలబొప్పి
ఇక చిరంజీవి సార్ తో రెండోసారి పని చేసే అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉన్నట్లు తమన్నా ట్వీట్ ద్వారా ఆనందం వ్యక్తపరిచింది, అలాగే చిత్ర యూనిట్ కి ధన్యవాదాలు తెలిపారు. 2019లో విడుదలైన పీరియాడిక్ యాక్షన్ డ్రామా సైరా మూవీలో తమన్నా హీరోయిన్ గా నటించారు. తమిళ్ హిట్ మూవీ వేదాళం రీమేక్ గా భోళా శంకర్ (Bhola shankar) తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తుండగా సెట్స్ పై ఉంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భోళా శంకర్ చిత్రంలో చిరంజీవి చెల్లిగా, కీర్తి సురేష్ నటించడం విశేషం.
Also read చిరంజీవి సినిమా టైటిల్ పెట్టడంపై స్పందించిన `రాజా విక్రమార్క` డైరెక్టర్
మరోవైపు చిరు-చరణ్ ల మల్టీస్టారర్ ఆచార్య విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 4న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న మెగా 154 పూజా కార్యక్రమాలతో లాంచ్ చేశారు. మరో మూవీ గాడ్ ఫాదర్ కూడా చిత్రీకరణ జరుపుకుంటుంది.