'ఆర్ఆర్ఆర్‌' లో డైలాగును స్వ‌యంగా చెప్పిన రాజ‌మౌళి

Surya Prakash   | Asianet News
Published : Nov 09, 2021, 02:56 PM IST
'ఆర్ఆర్ఆర్‌' లో డైలాగును స్వ‌యంగా చెప్పిన రాజ‌మౌళి

సారాంశం

ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఓ పవర్ ఫుల్ డైలాగును ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి బయటపెట్టేశారు. ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ఈ డైలాగు చెప్పారు.  

సాధారణంగా సినిమా లో డైలాగులు టీజర్, ట్రైలర్ రూపంలో తప్ప రిలీజ్ కు ముందు బయిటకు రావటానికి దర్శక,నిర్మాతలు ఇష్టపడరు. కానీ రాజమౌళి తీరే వేరు. మొదటి నుంచి ఆయన తన సినిమాలో కంటెంట్ ఇది అని చెప్పేసి ప్రిపేర్ చేస్తూ వస్తున్నారు. అదే లెక్కలో  ఓరేంజిలో ఎక్సపెక్టేషన్స్ పెంచేసిన ఆర్ ఆర్ ఆర్  లోని ఓ డైలాగుని ఆయన రివీల్ చేసి షాక్ ఇచ్చారు.

‘యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయి. అది ధర్మ యుద్ధమైతే’ అంటూ ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఓ పవర్ ఫుల్ డైలాగును ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి బయటపెట్టేశారు. ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ఈ డైలాగు చెప్పారు. ఈ సినిమాలో ఈ డైలాగ్‌ ఎవరు ఎవరితో చెబుతార‌న్న విష‌యాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ సినిమా నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన మొద‌టి డైలాగు ఇదేనంటూ అభిమానులు ఆనందంలో మునిగిపోతున్నారు. థియేట‌ర్ల‌లో ఈ డైలాగు విజిల్స్ వేయిస్తుందంటూ కామెంట్ చేస్తున్నారు.   

Also read Naatu Naatu song promo: వీర నాటు ఊర నాటు... అంచనాలు పెంచేసిన ఆర్ ఆర్ ఆర్ సాంగ్ ప్రోమో

జ‌న‌వ‌రి 7న ఈ సినిమా విడుద‌ల కానున్న నేప‌థ్యంలో రాజ‌మౌళి ప్రమోషన్స్ మొద‌లు పెట్టారు. ఇందులో భాగంగానే ఓ కార్య‌క్ర‌మంలో ఈ సినిమా గురించి మాట్లాడారు. కపిల్ దేవ్ క్రికెట్ ఆడిన నాటి రోజులు గుర్తుచేసుకుంటూ రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలోని డైలాగు చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఈ సినిమాలో బ్రిటిష్ వారితో హీరోలు పోరాటానికి సిద్ధ‌మ‌వుతోన్న స‌మ‌యంలో వారి గురువు ,మెంటర్ అజయ్ దేవగన్ ఆ డైలాగు చెబుతార‌ని అభిమానులు ఊహిస్తున్నారు. రాజ‌మౌళి చెప్పిన డైలాగు సోషల్ మీడియాలో  ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాను అనేక భాష‌ల్లో విడుద‌ల చేయ‌నున్నారు.

Also read ఎన్నాళ్లకెన్నాళ్లకు, 500 కోట్ల వైపు 'సూర్యవంశీ' పరుగులు.. రాజమౌళికి ఫుల్ జోష్

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చ‌రణ్‌తో పాటు అలియా భట్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్ర ఖని, శ్రియ తదితరులు కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు.   
 

PREV
click me!

Recommended Stories

Nayanthara House: 31 కోట్లతో 4BHK ఇల్లు, పోయెస్ గార్డెన్‌లో నయనతార కొత్త కాపురం?
Gaddar Film Awards List: ఉత్తమ నటిగా రష్మిక, ఉత్తమ నటుడు నాగచైతన్య.. రాజు వెడ్స్ రాంబాయికి అవార్డుల పంట