Samantha: సమంతను లైన్ లో పెడుతున్న తాప్సీ.. ఇంట్రెస్టింగ్ డిటైల్స్!

By team teluguFirst Published Nov 2, 2021, 10:46 AM IST
Highlights

తాప్సి బ్యానర్ నుండి మొదటి చిత్రం సమంతతో చేయబోతోందని ఓ వార్త బాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఓ లేడీ ఓరియెంటెడ్ స్టోరీలో Samantha హీరోయిన్ గా తాప్సి నిర్మాతగా ఉండనున్నారట.

ఒకప్పటి హీరోయిన్స్ తో పోల్చుకుంటే నేటి హీరోయిన్స్ తీరే వేరు. యాక్టింగ్ తో పాటు పలు రంగాలలో రాణించే ప్రయత్నం చేస్తున్నారు.స్టార్ హీరోయిన్స్ లో చాలా మంది వ్యాపారాలు కలిగి ఉన్నారు. కొంత మంది హీరోయిన్స్ సినిమా నిర్మాణంలో కూడా ఉన్నారు. తాజాగా హీరోయిన్ తాప్సీ పన్ను సైతం ప్రొడ్యూసర్ అవతారం ఎత్తుతున్నారు.  Tapsee pannu సొంతంగా ఓ నిర్మాణ సంస్థని ఏర్పాటు చేశారట. ‘అవుట్‌ సైడర్స్‌ ఫిలిమ్మ్స్‌’ అనే బ్యానర్ ఏర్పాటు చేసి సినిమాల్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తోందట.


తన బ్యానర్ నుండి మొదటి చిత్రం సమంతతో చేయబోతోందని ఓ వార్త బాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఓ లేడీ ఓరియెంటెడ్ స్టోరీలో Samantha హీరోయిన్ గా తాప్సి నిర్మాతగా ఉండనున్నారట. అలాగే తాప్సి నిర్మాతగానే  కాకుండా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించడానికి సిద్ధమవుతోందని వినికిడి. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. మరి ఇదే నిజం అయితే సమంత చేసే తొలి బాలీవుడ్ ప్రాజెక్ట్ ఇదే అవుతుంది. 

ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ తో సమంత బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. లేడీ రెబల్ గా సమంత నటన అక్కడి ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. అప్పటి నుండి సమంతకు బాలీవుడ్ ఆఫర్స్ వస్తున్నాయి. మరోవైపు షారుక్ ఖాన్ లేటెస్ట్ మూవీలో సమంత నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ తరువాత Shahrukh khan దర్శకుడు అట్లీతో చేస్తున్న చిత్ర షూటింగ్ బ్రేక్ ఇచ్చారు. ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న నయనతార డిలే కారణంగా ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని, ఆమె స్థానంలో సమంతను తీసుకుంటున్నారనే కథనాలు తెరపైకి వచ్చాయి. 

Also read ఇప్పటి వరకు ఒకెత్తు ఇప్పటి నుండి ఒకెత్తు... ఈ వయసులో ఆ ఊపు ఏంటి ప్రగతి మేడం, ఫైర్ డిపార్మెంట్ ని పిలవండి!
నాగ చైతన్యతో విడాకుల ప్రకటన తరువాత సమంత రెండు ప్రాజెక్ట్స్ ఓకె చేశారు. త్వరలో ఆమె తన నూతన చిత్రాల షూటింగ్స్ లో పాల్గొననున్నారు. ప్రసుతం సమంత తన ఫ్రెండ్స్ తో కలిసి దుబాయ్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సమంత నటించిన శాకుంతలం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రం మైథలాజిక కాన్సెప్ట్ తో తెరక్కెక్కింది. 

Also read ‘అఖండ’ కొత్త రిలీజ్ డేట్ ఖరారు,ఈ వారంలో ప్రకటన
 

click me!