Rakul Preeth: వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడొద్దు లైఫ్ లో రిలేషన్స్ కామన్... ప్రేమపై రకుల్ ఓపెన్ కామెంట్స్! 

By Sambi ReddyFirst Published May 23, 2022, 5:38 PM IST
Highlights

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లవ్, రిలేషన్స్ పై పెదవి విప్పారు. ప్రియుడు జాకీతో ప్రేమ చిగురించడానికి కారణాలు తెలిపారు. అదే సమయంలో వ్యక్తిగత విషయాలపై మీడియా ఫోకస్ అవసరం లేదని సున్నితంగా హెచ్చరించారు. 
 

నటిగా రకుల్ ఫుల్ బిజీ. రోజుల వ్యవధిలో రకుల్ నటించిన రెండు హిందీ చిత్రాలు విడుదలయ్యాయి. జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కిన అటాక్, అజయ్ దేవ్ గణ్, అమితాబ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన రన్ వే 34 చిత్రాలతో రకుల్ ప్రేక్షకులను పలకరించింది. ఈ చిత్ర ఫలితాలు అటుంచితే.. రకుల్ ఇంకా హిందీలో బోలెడు ఆఫర్స్ ఉన్నాయి. టాలీవుడ్ లో ఫేడ్ అవుట్ కాగానే తెలివిగా హిందీకి షిఫ్ట్ అయ్యింది. అక్కడ వరుస ఆఫర్స్ పెట్టేస్తూ సత్తా చాటుతున్నారు. 

కాగా ఈ మధ్య రకుల్ (Rakul Preeth Singh)కి పెళ్లి గోల ఎక్కువైపోయింది. గత బర్త్ డే నాడు రకుల్ తన ప్రియుడు జాకీ భగ్నానీ అంటూ పరిచయం చేసింది. నటుడు, నిర్మాత జాకీతో రకుల్ ఎప్పుడు ప్రేమలో పడిందా అని అందరూ ఆశ్చర్యపోయారు. ప్రేమలో ఉన్నారని తెలిస్తే మీడియా ఊరుకోదు. పెళ్ళెప్పుడు అంటూ ప్రతి ఇంటర్వ్యూలో అడుగుతున్నారు. ఈ ప్రశ్నతో విసిగిపోయిన రకుల్ కొన్ని సార్లు అసహనం కూడా వ్యక్తం చేశారు. తాజాగా రకుల్ మరోసారి తన ప్రేమ గురించి స్పందించారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakul Singh (@rakulpreet)

రకుల్ మాట్లాడుతూ..  జాకీ భగ్నానీ నేను మంచి స్నేహితులం. మా అభిరుచులు కలవడంతో ప్రేమలోపడ్డాం. మా రిలేషన్‌షిప్ గురించి ఓకే అనుకున్నప్పుడే వీలైనంత త్వరగా ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాం. ఎందుకంటే రిలేషన్‌ను బయటకు చెప్పకపోతే మా గురించే వచ్చే వార్తలు, పుకార్లతో ప్రశాంతంగా ఉండలేం. నిజానికి మా వ్యక్తిగత జీవితం గురించి కాదు, మేము చేసే వర్క్‌ గురించి అందరూ మాట్లాడుకోవాలి. ప్రతి ఒక్కరికీ పర్సనల్‌ లైఫ్ ఉంటుంది. ఒక రిలేషన్‌షిప్‌లో ఉండటం చాలా సహజం. మన లైఫ్‌లో పేరెంట్స్‌, బ్రదర్స్‌, సిస్టర్స్‌, ఫ్రెండ్స్‌ ఎలా ఉంటారో అలాగే మన కోసం ఒకరు ఉంటారు. సెలబ్రిటీలు కావడంతో మాపై అందరి దృష్టి ఎక్కువగానే ఉంటుంది. అది మాకిష్టం లేదు. అందుకే మేము బహిరంగంగా చెప్పేశాం.' అని రకుల్ కుండబద్దలు కొట్టింది. 

ఇక రకుల్ 31 అక్టోబర్ లేడీస్ నైట్ అనే బైలింగ్వెల్ మూవీ చేస్తున్నారు. ఇది తెలుగు తమిళ భాషల్లో విడుదల కానుంది. ఆమె నటిస్తున్న ఏకైక తెలుగు మూవీ ఇదే. హిందీలో మిషన్ సిండ్రెల్లా, ఛత్రి వాలి, థాంక్ గాడ్, డాక్టర్ జి చిత్రాల్లో నటిస్తున్నారు. కేరీర్ ఫుల్ స్వింగ్ లో ఉండగా రకుల్ మరో రెండు మూడేళ్లు పెళ్లి మాటెత్తే అవకాశం లేదు. సాధారణంగా కెరీర్ ముగియగానే హీరోయిన్స్ పెళ్లి చేసుకుంటారు. మరి రకుల్ జాకీ భగ్నానీ చేయి ఎప్పుడందుకుంటారో చూద్దాం... 

click me!